వీరమాచనేని ఆంజనేయ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7: పంక్తి 7:
[[వర్గం:1891 జననాలు]]
[[వర్గం:1891 జననాలు]]
[[వర్గం:1988 మరణాలు]]
[[వర్గం:1988 మరణాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]

07:33, 8 జూలై 2013 నాటి కూర్పు

వీరమాచనేని ఆంజనేయ చౌదరి (1891 - 1988) స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు.

వీరు 23 డిసెంబర్ 1891 తేదీన అనగా నందన నామ సంవత్సరం మార్గశిర మాసంలో గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోటయ్య మరియు లక్ష్మమ్మ. చిన్నతనంలోనే తల్లితోపాటు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేవాడు. పెద్దగా చదువుకోలేదు. అయినా ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అర్చకులు చదివే శ్లోకాలను ఒక్కసారి విని తిరిగి చెప్పేవాడు.

పది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో మేనమామల గ్రామం రేపల్లె తాలూకాలోని నల్లూరు చేరారు. అక్కడ వ్యవసాయపనులు చేసుకొంటూ తీరికవేళల్లో పురాణ, హరికథా కాలక్షేపాలకు వెళ్ళి భారత, భాగవత, రామాయణ కథా విశేషాలను గ్రహించి అందులోని పద్యాలను కంఠస్థం చేశారు.