ప్రొపెలిన్
ప్రొపెలిన్ (propylene)అనెది రంగులేని, మండే స్వభావం వున్న, వాయువురూపంలొ లభించె హైడ్రోకార్బన్.ఇది పెట్రోలియం నుండి లభిస్తుంది.రెసిన్లు, ఫైబర్‌లు మరియు ఎలాస్టోమర్‌లు మరియు అనేక ఇతర రసాయన ఉత్పత్తుల తయారీలో పెద్ద మొత్తంలో ప్రొపెలిన్‌ను ఉపయోగిస్తారు.[1]ప్రొపెలిన్ ను ప్రొపులిన్ అనికూడా ఉచ్చరిస్తారు.ఇది ఆల్కీన్ సమూహానికి చెందిన హైడ్రోకార్బన్.ఇది ఒక ద్విబంధాన్ని కార్బన్-కార్బన్ మధ్య కల్గి చుండును.ఒక అణువులొ మూడు కార్బన్ పరమాణువులు వుండును.రసాయమ సమీకరణ సూత్రం C3H6.ప్రొపెలిన్డు మూడు కార్బన్‌లతో ద్వంద్వ బంధాన్ని కలిగి ఉంది. మరియు పాలిమరైజేషన్, ఆక్సీకరణ, ఆల్కైలేషన్, ఆర్ద్రీకరణ మరియు హాలోజన్‌ని జోడించడం ద్వారా పాలీప్రొఫైలిన్ రెసిన్, అక్రిలోనిట్రైల్, యాక్రిలిక్ యాసిడ్, ప్రొపెలిన్ ఆక్సైడ్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ మరియు అసిటోన్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. పెట్రోకెమికల్ పరిశ్రమలో ఇథిలీన్ వలె ప్రొపెలిన్ ఒక ప్రాథమిక రసాయనం.[2]
ఉత్పత్తి
[మార్చు]పెట్రోలియం శుద్ది కరణ ప్రక్రియలొ మరియు ఇథలిన్ ఉత్త్పతి సమయంలొ ప్రొపెలిన్ ఒక ఉప ఉత్పత్తిగా ఏర్పడుతుంది.హైడ్రో కార్బన్ రసాయనాలను స్టీమ్ క్రాకింగ్(నీటి ఆవిరిద్వారా విచ్చిన్నం) అనే ప్రకియ విధానంలొనంలో ప్రొపెలిన్ ను ఉత్త్ప అవుతుంది.[3][4]
- ఈథేన్ మరియు బూటెన్ లమధ్య రసాయన చర్య వలన కూడా ప్రొపెలిన్ ఉత్పత్తి అవును.
- CH2=CH2 + CH3CH=CHCH3→ 2CH3CH=CH2[5]
భౌతిక గుణాలు
[మార్చు]ప్రొపెలిన్ ఒక ఒలేఫిన్ల వాసనతో రంగులేని వాయువు.ఇది దాని స్వంత ఆవిరి పీడనం కింద ద్రవీకృత వాయువుగా రవాణా చేయబడుతుంది.ఇది సులభంగా మండుతుంది. ప్రొపెలిన్ ఆవిర్లు గాలి కంటే బరువుగా ఉంటాయి.[6]
ప్రొపెలిన్ యొక్క భౌతిక గుణాల పట్టిక ఇక్కడ ఇవ్వడమైనది.
లక్షణం/గుణం | మితి/విలువ |
అణుభారం | 42.08[7] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | మైనస్(ఋణ)−185°C[7] |
మరుగు స్థానం | −47.7°C[7] |
వాయు సాంద్రత | 1.48(గాలి=1.0)[7] |
వక్రీభవన గుణకం | 1.3567[7] |
స్వీయ జలిత ఊష్ణోగ్రత | 460°C[8] |
బాష్పీకరణ గుప్తోష్ణం | 16.04కిలో జౌల్స్/మోల్ [9] |
ఫ్లాష్ పాయింట్ | (మైనస్)-108°C[10] |
ఇథనాల్, ఎసిటిక్ యాసిడ్‌లో బాగా కరుగుతుంది.[11]నీటిలో తక్కువ ప్రమాణంలో కరుగును.[12]
రసాయన చర్యలు
[మార్చు]ఈథీన్ వలె కాకుండా, ప్రొపీన్ తక్షణమే ప్రత్యామ్నాయ ప్రతిచర్యలకు లోనవుతుంది, ఇది విస్తృత శ్రేణి ముఖ్యమైన రసాయనాలకు దారి తీస్తుంది.[5]
పాలిమరైజెసన్
[మార్చు]ఉత్ప్రేరకం సమక్షంలో అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద మాత్రమే పాలిమరైజ్ అవుతుంది.[13]
ఉపయోగాలు
[మార్చు]1.దాదాపు మూడింట రెండు వంతుల ప్రొపైలిన్ పాలీప్రొఫైలిన్‌ను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది,అలగే దుస్తులు, ప్లాస్టిక్ స్క్వీజ్ సీసాలు, అవుట్‌డోర్ ఫర్నిచర్ మరియు అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించటానికి ప్రొపెలిన్ ఉపయోగిస్తారు.[14]
ఇవికూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "propylene". britannica.com. Retrieved 2024-06-06.
- ↑ "Propylene and Its Derivatives". chiyodacorp.com. Retrieved 2024-06-06.
- ↑ Schoenberg et al., 1982
- ↑ "Propylene". ncbi.nlm.nih.gov. Retrieved 2024-06-06.
- ↑ 5.0 5.1 "Propene (Propylene)". essentialchemicalindustry.org. Retrieved 2024-06-06.
- ↑ "PROPYLENE". cameochemicals.noaa.go. Retrieved 2024-06-06.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 "PROPYLENE". chemicalbook.com. Retrieved 2024-06-06.
- ↑ "PROPYLENE". inchem.org. Retrieved 2024-06-06.
- ↑ "Chemical Properties of Propene". chemeo.com. Retrieved 2024-06-06.
- ↑ "Propylene". haz-map.com. Retrieved 2024-06-06.
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-466
- ↑ "PROPYLENE". chemicalsafety.ilo.org. Retrieved 2024-06-06.
- ↑ "Propylene". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-06-06.
- ↑ "Propylene". chemicalsafetyfacts.org. Retrieved 2024-06-06.