ఫ్రిట్జ్ లాంగ్
ఫ్రిట్జ్ లాంగ్ | |
---|---|
జననం | ఫ్రెడరిక్ క్రిస్టియన్ అంటోన్ లాంగ్ 1890 డిసెంబరు 5 వియన్నా, ఆస్ట్రియా-హంగేరి |
మరణం | 1976 ఆగస్టు 2 బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియా, యుఎస్ | (వయసు 85)
సమాధి స్థలం | ఫారెస్ట్ లాన్ హాలీవుడ్ హిల్స్ స్మశానవాటిక |
పౌరసత్వం |
|
విద్యాసంస్థ | టెక్నికల్ యూనివర్సిటీ |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1910–1976 |
జీవిత భాగస్వామి | లిసా రోసెంతల్
(m. 1919; థియా వాన్ హార్బౌ
(m. 1922; div. 1933)లిల్లీ లాటే (m. 1971) |
ఫ్రిట్జ్ లాంగ్ (1890, డిసెంబరు 5 - 1976, ఆగస్టు 2) జర్మనీ - అమెరికా - ఆస్ట్రియన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు.[2] బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేత "మాస్టర్ ఆఫ్ డార్క్‌నెస్" గా పిలువబడడంతోపాటు[3] అన్ని కాలాలలో అత్యంత ప్రభావవంతమైన సినిమా దర్శకులలో ఒకడిగా పేర్కొనబడ్డాడు.[4]
జననం, విద్య
[మార్చు]లాంగ్ 1890, డిసెంబరు 5న అంటోన్ లాంగ్ (1860-1940)[5] - పౌలిన్ "పౌలా" లాంగ్ (1864-1920) దంపతులకు వియన్నాలో జన్మించాడు. తండ్రి వాస్తుశిల్పి, నిర్మాణ సంస్థ మేనేజర్ గా పనిచేశాడు.[6]
పాఠశాల పూర్తిచేసిన లాంగ్, వియన్నాలోని టెక్నికల్ యూనివర్సిటీలో చేరి సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. చివరికి కళారంగానికి అంకితమయ్యాడు. 1910లో వియన్నాను విడిచిపెట్టి యూరప్, ఆఫ్రికా అంతటా ప్రయాణించాడు. తరువాత ఆసియా, పసిఫిక్ ప్రాంతాన్ని సందర్శించాడు. 1913లో పారిస్‌లో చిత్రలేఖనాన్ని అభ్యసించాడు.
సినిమారంగం
[మార్చు]లాంగ్ తీసిన సినిమాలలో మెట్రోపాలిస్ (1927), ఎం (1931) వంటి అత్యంత ప్రసిద్ధ సినిమాలు ఉన్నాయి.[7][8] డా. మబుసే ది గ్యాంబ్లర్ (1922), డై నిబెలుంగెన్ (1924), వుమన్ ఇన్ ది మూన్ (1929), ఫ్యూరీ (1936), యు ఓన్లీ లివ్ వన్స్ (1937), హ్యాంగ్‌మెన్ ఆల్సో డై! (1943), ది వుమన్ ఇన్ ది విండో (1944), స్కార్లెట్ స్ట్రీట్ (1945), ది బిగ్ హీట్ (1953) వంటి సినిమాలు తీశాడు. 1939లో యునైటెడ్ స్టేట్స్ సహజ పౌరుడి పౌరసత్వం పొందాడు.
సినిమాలు
[మార్చు]- హాల్బ్లట్
- మాస్టర్ ఆఫ్ లవ్
- ది స్పైడర్స్ - పార్ట్ 1: ది గోల్డెన్ సీ
- హరకిరి
- ది స్పైడర్స్ - పార్ట్ 2: ది డైమండ్ షిప్
- ది వాండరింగ్ ఇమేజ్
- డాక్టర్ మబుస్, ది గ్యాంబ్లర్ - పార్ట్ 1: ది గ్రేట్ గ్యాంబ్లర్
- డాక్టర్ మబుస్, ది గ్యాంబ్లర్ - పార్ట్ 2: ఇన్ఫెర్నో
- డై నిబెలుంగెన్ - పార్ట్ 1: సీగ్‌ఫ్రైడ్
- డై నిబెలుంగెన్ – పార్ట్ 2: క్రిమ్‌హిల్డ్స్ రివెంజ్
- ఎం
- లిలియం
- ది రిటర్న్ ఆఫ్ ఫ్రాంక్ జేమ్స్
- వెస్ట్రన్ యూనియన్
- మ్యాన్ హంట్
- స్కార్లెట్ స్ట్రీట్
- సీక్రెట్ బియాండ్ ది డోర్
- క్లాష్ బై నైట్
- బ్లూ గార్డెనియా
- ది బిగ్ హీట్
- మూన్‌ఫ్లీట్
- ది టైగర్ ఆఫ్ ఎస్ష్నాపూర్
అవార్డులు
[మార్చు]- ఎం సినిమాకు 1931లో సిల్వర్ హ్యాండ్, జర్మన్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అసోసియేషన్[9]
- కమాండర్ క్రాస్ 1957, 1966లో ఆర్డర్ ఆఫ్ మెరిట్
- ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీచే 1963లో గోల్డెన్ రిబ్బన్ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్
- 1965లో ఫ్రాన్స్ నుండి ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్
- 1970లో ఎల్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డెల్ సినీ డి శాన్ సెబాస్టియన్ నుండి ఫలకం
- 1971లో గోల్డెన్ పుష్పగుచ్ఛముతో యుగోస్లేవియా జెండా ఆర్డర్
- 1973లో ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయం ద్వారా ఫైన్ ఆర్ట్స్ గౌరవ ప్రొఫెసర్
మరణం
[మార్చు]సినిమారంగానికి లాంగ్ చేసిన కృషికి 1960, ఫిబ్రవరి 8న హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్‌ని అందుకున్నాడు.[10][11]
1976, ఆగస్టు 2న స్ట్రోక్‌తో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో మరణించాడు. లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ హిల్స్‌లోని ఫారెస్ట్ లాన్ హాలీవుడ్ హిల్స్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.[12][13]
పరిరక్షణ
[మార్చు]హ్యూమన్ డిజైర్, మ్యాన్ హంట్‌తో సహా అనేక లాంగ్ చిత్రాలను అకాడమీ ఫిల్మ్ ఆర్కైవ్ భద్రపరిచింది.[14]
మూలాలు
[మార్చు]- ↑ Kürten, Jochen (December 4, 2015). "Born 125 years ago: Celebrating the films of Fritz Lang". Deutsche Welle. Retrieved 2023-06-21.
- ↑ Obituary Variety Obituaries, August 4, 1976, p. 63.
- ↑ "Fritz Lang: Master of Darkness". British Film Institute. Archived from the original on December 18, 2008. Retrieved 2023-06-21.
- ↑ "Fritz Lang: 10 essential films".
- ↑ "Architekturzentrum Wien". Architektenlexikon.at. Retrieved March 6, 2010.
- ↑ David, Eric. "The Master of Darkness". ChristianityToday.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-21.
- ↑ "The Directors (Fritz Lang)".
- ↑ Weide, Robert (Summer 2012). "The Outer Limits". Directors Guild of America, Inc..
- ↑ "Fritz Lang papers circa 1909–1973 1931–1973". Archived from the original on 2021-07-20. Retrieved 2023-06-21.
- ↑ "Fritz Lang | Hollywood Walk of Fame". walkoffame.com. Retrieved 2023-06-21.
- ↑ "Fritz Lang – Hollywood Star Walk – Los Angeles Times". projects.latimes.com. Retrieved 2023-06-21.
- ↑ Fritz Lang
- ↑ Krebs, Albin (August 3, 1976). "Fritz Lang, Film Director Noted for 'M,' Dead at 85". The New York Times. Retrieved January 22, 2009.
Friz Lang, the Viennese-born film director best known for "M", a terrifying study of a child killer, and for other tales of suspense, died yesterday in Los Angeles at the age of 85. He had been ill for some time, and had been inactive professionally for a decade.
- ↑ "Preserved Projects". Academy Film Archive.
బయటి లింకులు
[మార్చు]గురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఫ్రిట్జ్ లాంగ్ పేజీ
- Fritz Lang Bibliography (via UC Berkeley Media Resources Center)
- Senses of Cinema – Biographie
- Fritz Lang at filmportal.de
- Photos of Fritz Lang and cast of Hangmen Also Die Archived 2022-08-14 at the Wayback Machine by Ned Scott
- The Fritz Lang papers at the American Heritage Center
- "Interview with Fritz Lang, Beverley Hills, August 12, 1972" at Mubi.com