బహుమతి (గిఫ్ట్)

వికీపీడియా నుండి
(బహుమతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
క్రిస్మస్ చెట్టు కింద బహుమతులు

బహుమతి లేదా గిఫ్ట్ అనేది ప్రతిఫలంగా చెల్లించకుండా స్వచ్ఛందంగా ఇవ్వబడుతుంది లేదా ప్రశంసల చిహ్నంగా ఇవ్వబడుతుంది. (సాధారణంగా డబ్బు లేదా వస్తువు). సాధారణంగా బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రేమానురాగాలతో ఆప్యాయతతో కృతజ్ఞతా భావాన్ని చూపించే మార్గంగా వివిధ సందర్భాలలో బహుమతిని ఇస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా బహుమతులు ఇస్తారు, ప్రతిఫలంగా ఏమీ ఆశించరు. బహుమతి అనేది సాధారణంగా పుట్టినరోజు, పెళ్ళిరోజు, పండుగలరోజు వంటి ప్రత్యేక సందర్భాలలో బంధువులు లేదా స్నేహితులు ఒకరికొకరు ఇచ్చుకున్నేది. ఉదాహరణకు ప్రజలు క్రిస్మస్, దీపావళి వంటి పండుగల సమయంలో చాక్లెట్లు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, బొమ్మలు వంటి బహుమతులు పంచుకుంటారు. సాధారణంగా పెద్దలు పిల్లలకు బహుమతులను అందిస్తారు. పుట్టినరోజు, పెళ్ళిరోజు, పెళ్ళి రిసెప్షన్ రోజు వంటి కార్యక్రమాలలో ఇచ్చే బహుమతులు పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తికి లేదా పెళ్ళి జంటకు బహుమతులు ఇచ్చే వ్యక్తులు నేరుగా అందిస్తారు. ఇలాంటి సమయంలో ఇచ్చే బహుమతులకు రంగు కాగితాలను అందంగా చుట్టి ఇస్తారు. బహుమతులను ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయంలో ఇచ్చే వ్యక్తికి, గ్రహీతకి ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Mauss, Marcel; Halls, W.D. (1954). The Gift: Forms and Functions of Exchange in Archaic Societies. W. W. Norton & Company. ISBN 978-0-393-32043-5.
  • Hyde, Lewis (1983). The Gift: Imagination and the Erotic Life of Property. Vintage. ISBN 9780394715193.
  • Marion, Jean-Luc (2002). Being Given: Toward a Phenomenology of Givenness. ISBN 978-0-8047-3410-3.