Jump to content

బొంతు శ్రీదేవి

వికీపీడియా నుండి
బొంతు శ్రీదేవి
బొంతు శ్రీదేవి


గ్రేటర్ హైదరాబాద్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 - ప్రస్తుతం
ముందు బొంతు రామ్మోహన్

వ్యక్తిగత వివరాలు

జననం 17 డిసెంబర్ 1975
అమీర్‌పేట్ , హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి బొంతు రామ్మోహన్
సంతానం కుజిత, ఉషశ్రీ
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

బొంతు శ్రీదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2020లో జరిగిన హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బొంతు శ్రీదేవి హైదరాబాద్ లోని అమీర్‌పేట్ లో 17 డిసెంబర్ 1975న జన్మించింది. ఆమె కన్యాగురుకుల్ హైస్కూల్‌లో పదవ తరగతి, బేగంపేట్ మహిళ డిగ్రీ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ పూర్తి చేసింది.[2]

వివాహం

[మార్చు]

బొంతు శ్రీదేవి 7 ఫిబ్రవరి 2004న బొంతు రామ్మోహన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికీ ఇద్దరు కుమార్తెలు కుజిత, ఉషశ్రీ ఉన్నారు.[3]

తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత బొంతు శ్రీదేవి

రాజకీయ జీవితం

[మార్చు]

బొంతు శ్రీదేవి భర్త బొంతు రామ్మోహన్ హైదరాబాదు మహానగరపాలక సంస్థ మేయర్ కావడంతో ఆమె రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న తన భర్త మేయర్ గా ఎన్నికై బిజీగా ఉండడంతో ఆమె ఎక్కువు సమయం చర్లపల్లి డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేది. బొంతు శ్రీదేవి 2020లో జరిగిన హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ ఆమెకు 19 నవంబర్ 2020న టికెట్ కేటాయించింది.[4]ఆమె చర్లపల్లి డివిజన్ నుండి 2731 ఓట్ల మెజారిటీతో కార్పొరేటర్‌గా గెలిచింది.[5][6]

బొంతు శ్రీదేవి 2024 ఫిబ్రవరి 16న గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరింది.[7]

మూలాలు

[మార్చు]
  1. TV5 News (4 December 2020). "ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, చర్లపల్లిలో బొంతు శ్రీదేవీ గెలుపు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Mana Telangana (4 March 2019). "సేవే లక్ష్యంగా బొంతు శ్రీదేవి యాదవ్". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  3. Sakshi (14 February 2017). "మేయర్‌ ఇన్‌ లవ్‌." Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  4. Telangana Today (20 November 2020). "GHMC polls: TRS candidate Bonthu Sridevi files nomination papers". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  5. The Hindu (4 December 2020). "Hyderabad GHMC polls | TRS emerges single largest party" (in Indian English). Archived from the original on 27 January 2021. Retrieved 20 August 2021.
  6. The New Indian Express (5 December 2020). "GHMC results: Woman corporators to make up more than half council strength". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  7. V6 Velugu (16 February 2024). "కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)