బోళ్ల బుల్లిరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోళ్ళ బుల్లిరామయ్య

పదవీ కాలం
1984-89, 1991-98 & 1999-2004
తరువాత కావూరు సాంబశివరావు
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1926-07-09)1926 జూలై 9
తాటిపాక గ్రామం, తూర్పు గోదావరి జిల్లా
మరణం 2018 ఫిబ్రవరి 14(2018-02-14) (వయసు 91)
తణుకు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి వెంకట రమణమ్మ
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం తణుకు

బోళ్ళ బుల్లిరామయ్య ప్రముఖ భారత పార్లమెంటు సభ్యుడు. ఆంధ్రా షుగర్స్ ఛైర్మన్ గా పనిచేశారు.[1]

బాల్యము

[మార్చు]

బోళ్ళ బుల్లి రామయ్య తండ్రి బోళ్ల వీర వెంకన్న. వీరు జూలై 9వ తారీఖున 1926 వ సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా లోని తాటిపాక అనే గ్రామంలో జన్మించారు.

కుటుంబము

[మార్చు]

వీరు 26 వ తారీఖున మే నెల 1946 వ సంవత్సరంలో శ్రీ మతి వెంకట రమణమ్మ గారిని వివాహ మాడారు. వీరి శ్రీమతి స్వర్గస్తురాలైనది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

విద్య

[మార్చు]

శ్రీ బుల్లి రామయ్య గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసము చేశారు. Educational Qualifications B.Sc. (Hons.) (Sugar Tech.), M.Sc. (Chem. Tech.), M.Sc. (Chem. Engg.), A.M.P., Doctorate in Pub. Admn. Educated at Andhra University, Waltair (Andhra Pradesh) Wisconsin University (U.S.A.), Harvard University (U.S.A.), World University Round-Table, Benson, Arizona (U.S.A.) అనేక విభాగాలలో విద్య నబ్యశించిన వీరు ఆర్థిక వేత్తగా, పారిశ్రామిక వేత్తగా, విజ్ఞానశాస్త్ర వేత్తగా, గుర్తింపు పొందారు.

నివాసము

[మార్చు]

వీరి శాశ్వత చిరు నామా: వెంకట రాయ పురము, తణుకు, PachimaGodavari Jilla పిన్. నెం. 534215, ఆంధ్ర ప్రదేశ్, తాత్కాలికి విలాసము: ఎ.బి. 79, సహజీవన్ రోడ్, కొత్త డిల్లి. చర వాణి (011) 23782813/, 23782264.

రాజకీయ ప్రస్తానం

[మార్చు]

బోళ్ళ బుల్లి రామయ్య 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో (1985-86 మధ్య కాలంలో ) వారు అంచనాల సంఘంలో సభ్యునిగా కూడా ఉన్నారు. 1991 లో 10వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో రెండవసారి కూడా గెలుపొందారు. అదే విధంగా... 1996 లో 11 వ లోక్ సభకు, మూడవ సారి గెలుపొంది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. 1999 లో 13 వ లోక్ సభకు కూడా పోటీ చేసి నాల్గవ సారి గెలుపొందారు. 1999 - 2000 సంవత్సరాల మధ్యకాలంలో బుల్లి రామయ్య అనేక పార్ల మెంటరీ కమిటీలలో సభ్యులుగా సేవ లందించారు.

సమాజ సేవ

[మార్చు]

వీరు అనేక ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవ లందించారు. కళ్ళ పరీక్షలు, పోలియో నివారణ, వరదబాదితుల పునరావాసము వంటి అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొని ప్రజాసేవ చేశారు. వీరు రీ పెంద్యాల వెంకట కృష్ణ రంగరాయ స్మారక సమితి లోసభ్యులుగా వుండి 1983 లో తణుకులో వచ్చిన వరదల బాధితుల పునరావాస కార్యక్రమంలో పాల్గొని విశిష్ట సేవ నందించారు.

విదేశీ పర్యటన

[మార్చు]

బుల్లి రామయ్య గారు విదేశాలలో వుస్త్రుతంగా పర్యటించారు. అంతర్జాతీయ షుగ్ర్ టెక్నాలజీ (xvi and xvii) సొసైటి, పిట్స్ బర్గ్, అమెరికాలో జరిగిన సమావేశాలలో పాల్గొన్నారు.

అలంకరించిన రాజకీయేతర పదవులు

[మార్చు]

వీరు సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల స్థాపనకు వాటి ఆర్థిక వనరులు సమకూర్చి, నిర్వహణకు అనేక విధాలుగ కృషి చేసారు. అందులో భాగంగా తణుకులో పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో వైద్య కళాశాల, విజయవాడలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగింది. ఆంధ్ర్ షుగర్స్ లి.కు మేనేజర్ డైరెక్టరుగాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్,,, దక్షిణ భారత దేశ చక్కెర కర్మాగారాల అసోషియేషన్ సభ్యునిగాను పనిచేశారు. పెడరేషన్, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యునిగాను, భారత దేశ చక్కెర కర్మాగారాల సమాఖ్యలో సభ్యునిగాను, కాకినాడ మెడికల్ కాలేజీ గవర్నెంగ్ బాడీలో సభ్యునిగాను, ఇలా అనేక పారిశ్రామిక సంస్థలలోను, విద్యావిషయక సంస్థలలోను, పరిశోధన సంస్థలలోను, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో వంటి సంస్థలతో దేశ వ్యాప్తంగా బుల్లిరామయ్య సత్సంబంధాలు నెరపి వాటి అభివృద్ధికి తన వంతు సేవలందించారు.

మరణం

[మార్చు]

వీరు తణుకు లోని తమ స్వగృహంలో 2018, ఫిబ్రవరి 14వ తేదీన తమ 92వ యేట అనారోగ్యంతో మరణించారు[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్య కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 14 February 2018. Retrieved 14 February 2018.