భారతదేశ నౌకాదళ దినోత్సవం
భారత దేశములో నౌకాదళ దినోత్సవం (అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబరు 4 వ తేదీన జరుపుతారు.[1] దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. 17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి"గా భావిస్తారు.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో, ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు. ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధ నౌకలు, 8 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 24 కొర్వెట్టెలు, 13 సంప్రదాయ జలాంతర్గాములు, 1 అణు దాడి జలాంతర్గామి, 30 పెట్రోల్ ఓడలు, వివిధ సహాయక నౌకలు మొదలైనవి భారత నావికాదళంలో భాగం.
నేపథ్యం
[మార్చు]1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది.[2] 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నేవీ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది.
చిత్ర మాలిక
[మార్చు]-
2018లో గేట్వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్, టాటూ వేడుక
-
భారత నౌకాదళ సిబ్బంది గేట్వే ఆఫ్ ఇండియాపైకి దూసుకుపోతున్న దృశ్యం
-
Op Demo: ఇండియన్ నేవీ హెలికాప్టర్స్, సముద్రంలో MARCOS, ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్
-
2014లో నేవీ డే నేపథ్యంలో ఫైర్ వర్క్స్, షిప్లు
-
2015లో నేవీ డే వేడుకల్లో భాగంగా INS తార్కాష్, INS ఢిల్లీ ని సందర్శించే వ్యక్తులు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Mehta, Sulogna (November 26, 2016). "Naval ships showcase their strength during Day at Sea". The Times of India.