మడ అడవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడ అడవులు

నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి ఉంటాయి. మడ అడవులు అనేవి ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయం. ముఖ్యంగా 25° ఉత్తర, 25° దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి. ఈ చెట్లు, పొదలు, ఉప్పునీటి లోనూ, సముద్రపు నీటి లోనూ, సముద్రపునీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాధారము. ఇవి సముద్ర తీర ప్రాంతాలకు రక్షణా కవచంగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదల నుండి, తుఫాను దాడి నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు

[మార్చు]

మడ అ‍డవులు తూ.గో.జిల్లాలో కాకినా‍‍‍‍‍‍డ సమీప‍ంలోని కోర‍ంగి వద్ద విస్తృతంగా విస్తరించి ఉన్నాయి. తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉంది.

జీవన వైవిధ్యానికి ఇవే ఆలంబన

[మార్చు]

మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషింగ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి.

అంతరించిపోతున్నాయి

[మార్చు]
  • కలప సామగ్రి కోసం వాణిజ్యంగా అమ్మేసేందుకు నరుకుతున్నారు.
  • రొయ్యలు, చేపల సాగుకోసం వీటిని కొట్టేసి మడులుగా కడుతున్నారు.
  • నాటు సారా తయారీ దారులు వీటిని విచ్చలవిడిగా కాల్చేసి వారి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

బయటి లింకులు

[మార్చు]

https://web.archive.org/web/20130619030931/http://manakakinadalo.blogspot.in/2012/07/koringa-mangrove-forest-largest-in.html || ఆర్టికల్

"https://te.wikipedia.org/w/index.php?title=మడ_అడవులు&oldid=2954595" నుండి వెలికితీశారు