మాగుంట పార్వతమ్మ
మాగుంట పార్వతమ్మ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 - 2009 | |||
ముందు | వంటేరు వేణుగోపాల్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | బీద మస్తాన్ రావు | ||
నియోజకవర్గం | కావాలి | ||
లోక్‌సభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 1996 - 1998 | |||
ముందు | మాగుంట సుబ్బరామిరెడ్డి | ||
తరువాత | మాగుంట శ్రీనివాసులురెడ్డి | ||
నియోజకవర్గం | ఒంగోలు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1947 జూలై 27 బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | మాగుంట సుబ్బరామిరెడ్డి |
మాగుంట పార్వతమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించింది. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది.
రాజకీయ జీవితం
[మార్చు]మాగుంట పార్వతమ్మ 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డిని వివాహం చేసుకుంది. ఆయనను 1995 లో పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యుల చేతిలో హతమవ్వగా[2], 1996లో ఆమె 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 50060 ఓట్ల మెజారిటీతో గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైంది.[3][4] మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5] ఆమె 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయింది.[6]
మరణం
[మార్చు]మాగుంట పార్వతమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 25న మరణించింది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Magunta Parvathamma" (PDF). 2012. Archived from the original (PDF) on 16 March 2024. Retrieved 16 March 2024.
- ↑ "Lifer for two for Magunta's murder". The Hindu. 5 August 2000. Retrieved 27 November 2017.[dead link]
- ↑ Sakshi (5 April 2019). "ఒంగోలు పార్లమెంటులో వార్ వన్‌సైడ్". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ "Statistical Report on General Elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 26. Retrieved 27 November 2017.
- ↑ "State Elections 2004 - Partywise Comparison for 125-Kavali Constituency of Andhra Pradesh". Election Commission of India. Retrieved 27 November 2017.
- ↑ "Magunta Parvathamma hits the campaign trail". The Hindu. 6 May 2012. Retrieved 27 November 2017.
- ↑ Prajasakti (25 September 2024). "మాజీ ఎంపి మాగుంట పార్వతమ్మ మృతి - Prajasakti". Archived from the original on 25 September 2024. Retrieved 25 September 2024.
- ↑ Andhrajyothy (26 September 2024). "మాగుంట పార్వతమ్మ కన్నుమూత". Archived from the original on 26 September 2024. Retrieved 26 September 2024.