Jump to content

మాదిరెడ్డి సులోచన

వికీపీడియా నుండి
మాదిరెడ్డి సులోచన
జననంమాదిరెడ్డి సులోచన
1935
India శంషాబాద్ గ్రామం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణా రాష్ట్రం
మరణం1984
హైదరాబాదు
మరణ కారణంఅగ్ని ప్రమాదం
వృత్తిఉపాధ్యాయిని
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
మతంChristian

మాదిరెడ్డి సులోచన (1935 - 1984) కథా, నవలా రచయిత్రి.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

మాదిరెడ్డి సులోచన, 1935లో రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ గ్రామంలో జన్మించింది. హైదరాబాదులోని బి.వి.ఆర్.రెడ్డి మహిళాకళాశాలలో బి.ఎస్సీ చదివింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., ఎం.యిడి. చేసింది.

ఉద్యోగం

[మార్చు]

సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో రసాయనశాస్త్రం బోధించింది. భర్తతో బాటు ఇధియోపియా, జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసింది.

రచనా ప్రస్థానం

[మార్చు]
2017లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన నవల

ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల వ్రాసింది. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రచించింది. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]
  1. అందగాడు
  2. అద్దాల మేడ
  3. అంతము చూసిన అసూయ
  4. అందని పిలుపు
  5. అగ్నిపరీక్ష
  6. అధికారులు - ఆశ్రిత జనులు
  7. అపురూప
  8. ఋతుచక్రం
  9. కాంతిరేఖలు
  10. గాజుబొమ్మలు
  11. జీవనయాత్ర
  12. తరంగాలు
  13. తరం మారింది
  14. దేవుడిచ్చిన వరాలు
  15. పూలమనసులు
  16. ప్రేమలూ - పెళ్ళిళ్ళూ
  17. బిందుపథం
  18. భిన్నధ్రువాలు
  19. మతము-మనిషి
  20. మరీచిక
  21. మిస్టర్ సంపత్ ఎం.ఎ.
  22. రాగమయి
  23. వారసులు
  24. శిక్ష
  25. సజీవ స్మృతులు
  26. సుషుప్తి


కథాసంపుటాలు

[మార్చు]
  1. మాదిరెడ్డి సులోచన కథలు (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ)

కథలు

[మార్చు]
  1. అక్కయ్య చెప్పిన కధలు
  2. అద్దె ఇల్లు
  3. అనుభవం
  4. అభిమానులున్నారు జాగ్రత్త
  5. అమ్మాయిలూ జాగ్రత్త
  6. అసూయ
  7. ఆకలి కథ
  8. ఆణిఁకాడు
  9. ఆశకు హద్దులు
  10. ఇక్కడ...
  11. ఇది ఈతరం కథ
  12. ఇదీ భారతం
  13. ఇదేనా న్యాయం?
  14. ఇల్లరికపుటల్లుడు
  15. ఎగిరే మనిషి
  16. ఏమిటి జీవితం
  17. ఒక్క మాట
  18. ఓ తల్లి కథ
  19. కానుక
  20. కృష్ణ కన్నయ్యా
  21. కోరల్ బీచిలో కొన్ని క్షణాలు
  22. కోరిక తీరినవేళ
  23. ఖరీదయిన స్నేహము
  24. చివరకు మిగిలింది
  25. చీమలుపెట్టినపుట్టలు
  26. చెరగని ముద్రలు
  27. జరుగుతున్న చరిత్ర
  28. జాలీ మనసులు ఖాళీ జేబులు
  29. తప్పు నాదా
  30. తప్పెవరిది
  31. తల్లిమనసు
  32. తాడి క్రింద పాలు
  33. దేవుడు తెల్లబోయాడు
  34. దోషులెవరు
  35. పంజరంవిడిచిన పక్షి
  36. పడిలేచే కడలితరంగం
  37. పాపం పసివాడు
  38. పుట్టినరోజు
  39. ప్రగతిపధమా?పతనమార్గమా?
  40. బ్రతకటానికోదారి
  41. భలే భార్యలు
  42. భాగ్యలక్ష్మి
  43. భార్యా కోపవతీ...
  44. మంచి ముహూర్తం
  45. మగ రచయిత్రి
  46. మదిరా- మదవతీ
  47. మధుర స్మృతి
  48. మధురం మధురం అధరం మధురం
  49. మనసా నొప్పించకే ఇలా...!
  50. మనిషీనీవిలువెంత?
  51. మరపురాని క్షణాలు
  52. మృత్యువు కూడా...
  53. మౌనరాగాలు
  54. యుగళ సంగీతం
  55. రంగప్రవేశం
  56. రేవతి
  57. రోమియో
  58. శోభాదేవి
  59. సమర్థింపు
  60. సిన్సియారిటీ ఖరీదు
  61. స్త్రీబుద్ధిః ప్రళయాంతకః
  62. స్నేహం
  63. హక్కు
  64. హరిప్రియ
  65. హరివిల్లు

పురస్కారాలు

[మార్చు]
  • గృహలక్ష్మి స్వర్ణకంకణము - 1978

మరణం

[మార్చు]

1984లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో మాదిరెడ్డి సులోచన మరణించింది.

మూలాలు

[మార్చు]