మీసాల గీత
మీసాల గీత | |||
| |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
ముందు | పూసపాటి అశోక్ గజపతి రాజు | ||
---|---|---|---|
తరువాత | కోలగట్ల వీరభద్రస్వామి | ||
నియోజకవర్గం | విజయనగరం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 17 సెప్టెంబర్ 1977 విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మీసాల శ్రీనివాస రావు | ||
సంతానం | కిరీటయా సత్యసువర్ణ వర్ణ & సువర్ణ వర్ణంబ | ||
నివాసం | సిద్ధార్థ నగర్, తోటపాలెం, విజయనగరం పట్టణం, విజయనగరం జిల్లా |
మీసాల గీత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]మీసాల గీత 17 Sep 1977లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరంలో జన్మించింది. ఆమె ఎం.ఆర్.ఉమెన్స్ కాలేజీ నుండి బీకామ్ పూర్తి చేసింది
రాజకీయ జీవితం
[మార్చు]మీసాల గీత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో ఎన్నికల్లో పీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి విజయనగరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసింది. మీసాల గీత 2014 ఫిబ్రవరి 17న మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరింది.[1] ఆమె 2014లో ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పై 15404 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది. మీసాల గీతకు 2019లో టీడీపీ టికెట్ దక్కలేదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 February 2014). "కాంగ్రెస్ పార్టీకి గీత రాజీనామా". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ HMTV (26 June 2019). "మీసాల గీత దారెటు?". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.