ముక్కామల రాఘవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముక్కామల రాఘవయ్య ప్రముఖ రంగస్థల నటులు.

జననం[మార్చు]

ఈయన 1912లో జన్మించారు.

ఉద్యోగం[మార్చు]

ఉపాధ్యాయునిగా పనిచేశారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

మొదట్లో పురుష పాత్రలు పోషించినా, ఆతరువాత స్త్రీ పాత్రలు వేశారు. వృత్తిరిత్యా ఉపాధ్యాయులైన రాఘవయ్య తను ఏ ఊరు బదిలీ అయితే, ఆ ఊళ్లో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, అక్కడ ఒక యవ నాటక బృందాన్ని తయారుచేసి, నాటకాలు ప్రదర్శించేవారు. గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రదర్శించిన వీరాభిమన్యు, నాయకురాలు వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు. పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలేకాకుండా, సాంఘిక నాటకాలైన పల్లెపడుచు, కులంలేని పిల్ల, పేదరైతు, నేటిన్యాయం మొదలైన నాటకాలలో పురుష పాత్రలు ధరించారు.

వీరి నటనకు అనేక బహుమతులు (సువర్ణ కంకణాలు, ప్రశంసా పత్రాలు, రజిత పాత్రలు) వచ్చాయి. మాధవపెద్ది సత్యం, స్థానం నరసింహరావు, పారుపల్లి, అబ్బూరి వంటి నటులతో కలిసి నాటకాలు వేశారు.

నటించిన నాటకాలు[మార్చు]

  • వీరాభిమన్యు
  • నాయకురాలు
  • పల్లెపడుచు
  • కులంలేని పిల్ల
  • పేదరైతు
  • నేటిన్యాయం

పోషించిన పాత్రలు[మార్చు]

  • గయుడు
  • దుర్యోధనుడు
  • హైదర్ జంగ్
  • కైక
  • మల్లమాంబ
  • సుభద్ర
  • సత్యభామ
  • చింతామణి

మూలాలు[మార్చు]

  • ముక్కామల రాఘవయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 226.