యారాడ కొండలు
యారాడ కొండలు | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 350 మీ. (1,150 అ.) |
నిర్దేశాంకాలు | 17°39′57″N 83°15′21″E / 17.665953°N 83.255913°E |
భౌగోళికం | |
యారాడ కొండలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం పక్కనగల యారాడ ప్రాంతానికి దక్షిణాన ఉన్న కొండలు.[1] యారాడ సముద్రతీరం నుండి కేవలం 4.6 కిలోమీటర్ల దూరంలో ఈ కొండల ప్రాంతం ఉంది.[2]
భౌగోళికం
[మార్చు]ఈ కొండలు 17°39′57″N 83°15′21″E / 17.665953°N 83.255913°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉన్నాయి. యారాడ సముద్రతీరం, డాల్ఫిన్ ముక్కుల మధ్య ఉన్న ఈ యారాడ కొండలు 3.5 కి.మీ.ల పొడవుతో, 350 మీటర్ల ఎత్తుతో ఉన్నాయి.[3][4]
పర్యాటకం
[మార్చు]ఈ కొండల మీదినుండి లైట్ హౌస్, బీచ్, అద్భుతమైన విశాఖ నగర దృశ్యం కనపడుతుండడంతో పర్యాటకులు తరచుగా ఈ కొండల సందర్శనకు వస్తుంటారు. విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.[5] యారాడ కొండపై 13 ఎకరాల్లో ఒక హిల్ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.[6] ఇక్కడ రాస్ హిల్ చర్చి కూడా ఉంది. మిస్టర్ మోన్సియూర్ రాస్ చేత 1867 సంవత్సరంలో నిర్మించబడిన ఈ చర్చి బ్రిటిష్ యుగం కాథలిక్ చర్చి.
మూలాలు
[మార్చు]- ↑ "Sun, sand and solitude". 22 September 2018. Retrieved 24 September 2018.
- ↑ "Yarada Beach Vizag". vizagtourism.org.in. Retrieved 2021-07-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pollution study" (PDF). 18 August 2018. Retrieved 19 August 2018.
- ↑ P. Chandramohan; T.V. Narasimha Rao; D. Panakala Rao; B. Prabhakara Rao (18 June 1984). "Studies on Nearshore Processes at Yarada Beach (South of Visakhapatnam Harbour)" (PDF). Retrieved 13 September 2018.
- ↑ "Tourist hub to come up at Yarada Hill". 29 September 2019. Retrieved 30 September 2019.
- ↑ Sep 29, TNN / Updated:; 2019; Ist, 09:43. "Tourist hub to come up at Yarada hill | Visakhapatnam News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)