రక్షరేఖ
స్వరూపం
రక్షరేఖ (1949 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో రక్షరేఖ ప్రకటన | |
---|---|
దర్శకత్వం | ఆర్.పద్మనాభన్ |
నిర్మాణం | ఆర్.పద్మనాభన్ |
రచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, పి.భానుమతి, అంజలీదేవి, కస్తూరి శివరావు, జూనియర్ లక్ష్మీరాజ్యం |
సంగీతం | ఓగిరాల రామచంద్రరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.భానుమతి, కస్తూరి శివరావు, ఎ.పి.కోమల, టి.కనకం, వక్కలంక సరళ |
నిర్మాణ సంస్థ | ఆర్.పద్మనాభన్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 30, 1949 |
భాష | తెలుగు |
అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి నటించిన జానపద చిత్రం రక్షరేఖ. ఈ చిత్రంలో మొత్తం పాటలు, పద్యాలు 16 దాకా ఉన్నాయి. ఈ చిత్రపు కథను కాశీమజిలీ కథల ఆధారంగా బలిజేపల్లి లక్ష్మీకాంతం వ్రాశాడు.[1]
పాటలు
[మార్చు]గీత రచయిత: బలిజేపల్లి లక్ష్మీకాంతం.
- ఓ ఓహో రాజసుకుమారా రారా సుకుమారా రావోయీ నీ - ఎ.పి.కోమల, ఘంటసాల
- చెయ్యి చెయ్యి కలుపుకోర చిన్నారి మావగా చిలకలాంటి - టి. కనకం, కస్తూరి శివరావు
- జీవనడోలీ మధుర జీవన కేళీ ఇదే ప్రేమసుధా వాహిని - ఘంటసాల, పి. భానుమతి
- బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతో - వక్కలంక సరళ
- భలే పిల్లా చూశానమ్మా పిల్లంటే పిల్ల కాదు లోకంలో పిల్లలంతా - కస్తూరి శివరావు
- రామనామ జపమే సుమ మనోరంజనంబురా రామనామ సంకీర్తనమే - ఘంటసాల బృందం
- పండుగపొంగళ్ళు గంగమ్మా పాలవెల్లి పొంగళ్ళు - రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం (తొలి తెలుగు సినిమా సంక్రాంతి పాట)
- అభయము నీవేగా శార్వాణి త్రిభువన కళ్యాణి _పాలువాయి భానుమతి
- నీవులేని నా జీవితమే వృధా వృధా సుధా_పి.భానుమతి
- కమలదళ లోచనా భవతరణా కామిత ఫలదాతవే
- చలోరే ఠoగధా ఘోడా ఆకాశంలో ఎగిరే ఘోడ_కె.శివరావు
- మాణిక్యమాల వీణాపాణి మధుర మధుర దివ్యామృత వాణి_పి.భానుమతి
- మాతా గోమాతా మా ఇలవేల్పువై మా ఇంట వెలసినావే_
- యాహీ ఆ యాహీ ఆయాహీ వీరహనుమాన్ లంకాపురమున_
- సన్యాసి సఖీ సంసారీ దు: ఖీ సన్యాసికి బెత్తెడు గోచీ సంసారికి _కె. శివరావు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)