రాజు యాద‌వ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజు యాద‌వ్‌
దర్శకత్వంకృష్ణ‌మాచారి
రచనకృష్ణ‌మాచారి
నిర్మాతప్ర‌శాంత్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసాయిరామ్ ఉద‌య్‌
కూర్పుబొంత‌ల నాగేశ్వ‌ర్ రెడ్డి
సంగీతంహ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
నిర్మాణ
సంస్థ
సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్
విడుదల తేదీs
24 మే 2024 (2024-05-24)(థియేటర్)
24 జూలై 2024 (2024-07-24)(ఆహా ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

రాజు యాద‌వ్‌ 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. గెటప్ శ్రీను, అంకిత ఖారత్ ప్రధాన పాత్రల్లో నటించిన టీజర్‌ను 2023 జనవరి 14న,[1] ట్రైలర్‌ను 2024 మే 5న విడుదల చేశారు.[2]

ఈ సినిమా ఆహా ఓటీటీలో జులై 24 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

చిత్ర నిర్మాణం

[మార్చు]

రాజు యాద‌వ్‌ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో 21 నవంబర్ 2020న ప్రారంభమైంది.[4]ఈ సినిమాకు ఫస్ట్‌ గ్లింప్స్‌ను 17 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[5][6]

రాజు యాదవ్ (గెటప్ శ్రీను) మహబూబ్​నర్‌లో డిగ్రీ చేసి ఖాళీగా ఉంటుంటాడు . ఓ రోజు స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా అతడికి ముఖానికి బంతి బలంగా తాకుతుంది. దీంతో అతడి ముఖంలో మార్పులు వస్తాయి. ఎప్పుడు నవ్వుతూనే ఉండే డిజార్డర్ అతడికి వస్తుంది. దీంతో ఎప్పుడు నవ్వుతున్నట్టే కనిపిస్తాడు. ఇది తగ్గేందుకు సర్జరీ అవసరమని వైద్యులు చెబుతారు. అందుకు డబ్బు లేక అతడు ఆగిపోతాడు. ఈ క్రమంలో తన మిత్రుడి పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ స్వీటీ (అంకిత ఖారత్)ని చూసి రాజు ప్రేమలో పడతాడు. స్వీటీకి హైదరాబాదులో ఉద్యోగం వస్తే రాజు యాదవ్ కూడా హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్ వెళ్లిన తరువాత రాజుయాదవ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజు జీవితం చివరికి ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[7]

నటీనటులు

[మార్చు]
  • గెటప్ శ్రీను[8][9]
  • అంకిత క‌ర‌త్‌
  • ఆనంద చక్రపాణి
  • రూపాల‌క్ష్మి
  • ఉన్న‌తి
  • ఉత్త‌ర ప్ర‌శాంత్‌
  • ప‌వ‌న్ ర‌మేశ్‌
  • సంతోష్ రాజ్‌
  • రాకెట్ రాఘవ
  • మిర్చి హేమంత్
  • జబర్దస్త్ సన్నీ
  • సంతోష్ కల్వచెర్ల
  • శ్రీరామ్
  • కళ్యాణ్ భూషణ్
  • శ్రీ మణి
  • అవినాష్ సుంకర
  • శ్రీ హర్ష చాగంటి
  • శ్రీరామ్ రెడ్డి రామిడి
  • ప్రాచి

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (14 January 2023). "'రాజు యాదవ్' టీజర్ విడుదల". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  2. 10TV Telugu (5 May 2024). "గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' ట్రైలర్ చూశారా? ఫేస్ లో నవ్వు అలాగే ఉండిపోతే." (in Telugu). Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (18 July 2024). "ఓటీటీలోకి 'రాజు యాదవ్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  4. HMTV (21 November 2020). "గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాద‌వ్‌' సినిమా ప్రారంభం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
  5. Eenadu (17 April 2021). "స్వీటీ వెంటపడుతున్న గెటప్‌ శ్రీను - raju yadav telugu movie glimpse 4k". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
  6. EENADU (14 May 2024). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్‌.. అటు థ్రిల్‌". Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.
  7. "రాజు యాదవ్ రివ్యూ: గెటప్ శ్రీను హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?". 24 May 2024. Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  8. Chitrajyothy (24 May 2024). "రాజు యాదవ్‌ ఓ ఎమోషనల్‌ రైడ్‌ | Raju Yadav is an emotional ride". Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  9. EENADU (24 May 2024). "ఇదొక పాత్రే తప్ప... హీరో అనుకోలేదు". Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  10. Andhrajyothy (14 May 2024). "గ‌తంలో స్పానిష్ చిత్రాలు చేశా.. ఇప్పుడు రాజుయాద‌వ్ తీశా". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.

బయటి లింకులు

[మార్చు]