రోసేసి
స్వరూపం
రోసేసి | |
---|---|
Flower of Rosa arvensis | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | రోసేసి |
ఉపకుటుంబాలు | |
Rosoideae | |
రోసేసి ప్రపంచ విస్తరణ |
రోసేసి (Rosaceae) పుష్పించే మొక్కలలో గులాబి కుటుంబం. దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.
సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడింది. రోసాయిడే, స్పైరాయిడే, మేలాయిడే, అమిగ్డలాయిడే. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.
వర్గీకరణ
[మార్చు]- ఉపకుటుంబం రోసాయిడే: వీనిలోని మొక్కలు ఎఖిన్ లేదా డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. దీనిలో సుమారు 20 ప్రజాతులున్నాయి. ఉదా: గులాబి, బ్లాక్ బెర్రీ, రాస్ప్ బెర్రీ, స్ట్రాబెర్రి మొదలైనవి.
- ఉపకుటుంబం స్పైరాయిడే: వీనిలో ఐదు కవచాలు కలిగిన శుష్క ఫలాలు కాస్తాయి. దీనిలో స్పైరియా, సార్బారియా అనే ప్రజాతులున్నాయి.
- ఉపకుటుంబం మేలాయిడే: ఇవి ఐదు కవచాలు కలిగిన కండగల పోమ్ అనే ఫలాలనిస్తాయి. వీనిలో ఆపిల్, పియర్ మొదలైన ప్రజాతులున్నాయి.
- ఉపకుటుంబం అమిగ్డలాయిడే: వీనిలో ఒకే ఒక్క డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. వీనిలో ప్లమ్, పీచ్, బాదం, చెర్రీ, ఆప్రికాట్ మొదలైన ప్రజాతులున్నాయి.
ఆర్ధిక ప్రాముఖ్యత
[మార్చు]ఇది ఆర్థిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉంది. దీనిలో ఆపిల్స్, బాదం, స్ట్రాబెర్రీ మొదలైనవి ఉన్నాయి.