వంగీపురం నీరజాదేవి
Appearance
వంగీపురం నీరజాదేవి | |
---|---|
జననం | డిసెంబరు 31, 1968 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | కూచిపూడి నృత్యకారిణి |
వంగీపురం నీరజాదేవి తెలంగాణ రాష్ట్రంకు చెందిన కూచిపూడి నృత్యకారిణి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ నృత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జీవిత విషయాలు
[మార్చు]నీరజాదేవి 1968, డిసెంబరు 31న వనపర్తిలో జన్మించింది.
కళారంగం
[మార్చు]1979లో స్వర్ణముఖి పేరుతో ఆర్ట్స్ అకాడమీని స్థాపించిన నీరజాదేవి, అనేకమంది ఔత్సాహిక కళాకారులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చింది. 2008లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన నీరజాదేవి ‘నాట్యవిద్యాదరి’, ‘మువ్వలసవ్వడి’ వంటి అవార్డులను అందుకుంది.[2]
పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015లో కూచిపూడి ఉత్తమ కళాకారిణి అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2.
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[3]
- జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ పురస్కారం (మహబూబ్‌నగర్, 2016 అక్టోబరు 2) [4]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 13 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 13 March 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్ సేఫ్టీ స్టేట్ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 13 March 2020.
- ↑ ఆంధ్రప్రభ, మహబూబ్‌నగర్ (2 October 2016). "మహబూబ్‌నగర్ : నేడే జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారి పురస్కారాల ప్రధానోత్సవం". Archived from the original on 13 మార్చి 2020. Retrieved 13 March 2020.