Jump to content

వారిజా రాణి

వికీపీడియా నుండి
వారిజా రాణి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తితెలుగు ప్రొఫెసర్

ఆచార్య వారిజా రాణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, ఆచార్యురాలు. ప్రస్తుతం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది.

జననం, విద్య

[మార్చు]

వారిజా రాణి పాలెపు గుండయ్య - ఉషారాణి దంపతులకు తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా, ధర్మపురిలో జన్మించింది. గుండయ్య ప్రభుత్వ టీచర్‌గా పనిచేసి విరమణ పొందాడు. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బీఏలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారిజా రాణి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, సంస్కృత భాషల్లో పీజీ, తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది. ఆ తరువాత హైదరాబాదు విశ్వవిద్యాయలంలో ఎంఫిల్‌ తోపాటు, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య పర్యవేక్షణలో తెలుగు, సంస్కృత కావ్యాలపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందింది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వారిజా రాణికి గుండి విష్ణుప్రసాద్‌ తో వివాహం జరిగింది. విష్ణుప్రసాద్‌ ఐసీఐసీఐ రీజనల్‌ హెడ్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. కుమారుడు ముకుంద్‌ శాస్త్రి అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసి, ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతిభావంతులైన యువతకు ప్రదానం చేసే సాహిత్యంలో జాతీయ స్కాలర్‌షిప్ కు ఎంపికైంది. విశ్వవిద్యాలయ స్థాయిలో 11 సంవత్సరాలుగా బోధనారంగంలో ఉంది. వారిజా రాని పర్యవేక్షణలో నలుగురు విద్యార్థులు పీహెచ్‌డీ డిగ్రీలు పొందగా, మరో 15 మంది విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సును అభ్యసిస్తున్నారు.[2]

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేసింది.[3] తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్న సమయంలోనే 2023 మార్చి 16న మహిళా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్‌గా నియమితులయింది.[1]

సాహిత్యరంగం

[మార్చు]

వారిజా రాణి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నది. తెలంగాణలో ఎరుకల భాష, బంజారా లిపిపై పరిశోధనలు పనిచేసింది. భారత ప్రభుత్వ సమాచార శాఖ ప్రాంతీయ సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా రెండేళ్ళపాటు సేవలందించింది.

రచనలు

[మార్చు]
  1. రాజయోగి శ్రీ గుండి రాజన్న శాస్త్రి[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 telugu, NT News (2023-03-17). "మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌గా వారిజారాణి". www.ntnews.com. Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.
  2. "Varija Rani, Ph.D – University of SiliconAndhra". www.uofsa.edu. Archived from the original on 2021-12-01. Retrieved 2023-03-17.
  3. "ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ". www.osmania.ac.in. Archived from the original on 2021-07-11. Retrieved 2023-03-17.
  4. "Raja' Yogi Sri Gundi Rajanna Shastri". Flipkart.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.