వి.ఎ.సుందరం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వి.ఎ.సుందరం | |
---|---|
జననం | కోయంబత్తూర్, భారతదేశం | 1896 ఫిబ్రవరి 2
మరణం | 1967 మార్చి 11 ముంబై, భారతదేశం | (వయసు 71)
జీవిత భాగస్వామి | సావిత్రి (1909–1968) |
పిల్లలు | పుష్ప, రామకృష్ణ, వివేకానంద, సరస్వతి, పద్మ |
సంతకం | |
వి.ఎ.సుందరం ( 1896 ఫిబ్రవరి 2 - 1967 మార్చి 11) పూర్తిపేరు వెల్లలూర్ అన్నస్వామి సుందరం. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక కీలక కార్యకర్త. పండిట్ మదన్ మోహన్ మాలవ్య విశ్వాసపాత్రుడు. మహాత్మా గాంధీ సహచరుడు. కార్యదర్శిగా వ్యవహరించమే కాకుండా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కోసం నిధుల సేకరణ చేసారు. అతని విధి అంతర్జాతీయంగా సాంస్కృతిక దృక్పథంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కమ్యూనికేషన్, ప్రజా సంబంధాలపై దృష్టి పెట్టడం. అన్నింటికిమించి నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి.[1]
తొలి దశలో
[మార్చు]వి.ఎ.సుందరం దక్షిణ భారతదేశంలోని కోయంబత్తూర్‌లో సనాతన తమిళ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు.[2] తండ్రి అన్నస్వామి అయ్యర్, న్యాయవాది, సమీపంలోని వెల్లలూర్ గ్రామానికి చెందినవాడు. అతనికి చిన్నతనం నుంచి సాహిత్యం, కవిత్వంపై ఆసక్తిని కనబరిచేవాడు. అలాగే ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకున్నాడు. హైస్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత అతను ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి మద్రాసులోని ప్రఖ్యాత పచ్చయ్యప్ప కళాశాలలో చేరాడు. కానీ చదువు మధ్యలోనే భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. డిసెంబరు 1914 సంవత్సరం మద్రాసులో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యాడు.
వ్యక్తిగత జీవితం, వారసత్వ సంపద
[మార్చు]వి.ఎ.సుందరం మతపరమైన సరిహద్దులకు మించి సామరస్యం, ఐక్యత అనే భావనతో ఉండేవాడు. అతనికి యవ్వన ప్రాయం నుండి క్రైస్తవ సంస్కృతి, తత్వశాస్త్రంపై ఆసక్తి ఉండేది. తరువాత బెనారస్‌లోని అతని ఇల్లు చాలా మంది క్రైస్తవ, ముస్లిం అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది. అతని మతపరమైన ఆలోచనలను వివిధ రూపాలలో గాంధీ, సాధు సుందర్ సింగ్, స్వామి శివానంద మొదలైనవారితో పంచుకునేవాడు. ఒకానొక సమయంలో అతను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడినప్పటికీ, అతను ఎల్లప్పుడూ ఆంగ్ల సంస్కృతి, సాహిత్యాన్ని అభిమానించేవాడు. తన పిల్లలందరినీ ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్‌కు పంపాలని ప్రయత్నించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ తరువాత, 1956లో వి.ఎ.సుందరం, అతని భార్య సావిత్రి బొంబాయికి వెళ్లి, వారి పెద్ద కొడుకుతో కలిసి చివరి రోజులు గడిపారు. 1967 మార్చి 11న అతను మరణించాడు. బెనారస్‌లోని అతని ఇల్లు 'కృష్ణకుటిర్', 2013లో 'హెరిటేజ్ కాంప్లెక్స్'లో భాగం చేయడానికి ప్రణాళిక చేయబడింది. దాని పేరు 'గాంధీ మెమోరియల్'.[3][4][5]
కొన్ని ప్రచురణలు
[మార్చు]- (Ed.) బెనారస్ హిందూ యూనివర్శిటీ 1905–1935. బెనారస్ 1936. ఇంటర్నెట్ లో Digital Library of India, Govt. of India
- అల్మా మేటర్. బెనారస్ 1940.
- రవీంద్రనాథ్ ఠాగూర్. బెనారస్ 1941. ఇంటర్నెట్ లో Internet Archive. పునర్ముద్రణ 2011, నబు ప్రెస్, ISBN 978-1245206167
- (Ed.) బెనారస్ హిందూ యూనివర్శిటీ 1916–1942, సిల్వర్ జూబ్లీ ఎడిషన్. బెనారస్ 1942. ఇంటర్నెట్ లో Digital Library of India, Govt. of India
- టార్చ్ బేరర్స్ (రెండు ప్రత్యేక కరపత్రాల శ్రేణి: మహాత్మా గాంధీజీ, మహమన మాలవ్యాజీ. బెనారస్ 1948. ఇంటర్నెట్ లో BHU library, Mahamana Digital Library
- హోమేజ్ టు మాలవ్యాజీ. బెనారస్ 1949. ఇంటర్నెట్ లో BHU library, Mahamana Digital Library
చిత్రమాలిక
[మార్చు]-
1930 మేలో గాంధీతో..
-
వి.ఎ.సుందరం బనారస్ హిందూ యూనివర్సిటీ కలెక్షన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అతని పనికి మాళవ్య ప్రశంసా పత్రం - 1932 ఫిబ్రవరి 15
-
1948లో బనారస్ హిందూ యూనివర్సిటీ మైదానంలోని తన ఇల్లు 'కృష్ణకుటిర్' ని సందర్శించిన భారత గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి
మూలాలు
[మార్చు]- ↑ The theme of beauty had reference to his name, "Sundaram" meaning "beauty" and "beautiful" in Sanskrit. Gandhi described Sundaram as "(having) the virtues suggested by his name." Coll. Works, Vol. 49, Doc. 254
- ↑ South Indian names, Wikilink
- ↑ The planned Heritage Complex, BHU website
- ↑ Gandhi regularly exchanged letters – and visits – with Sundaram over a time of 30 years, from 1916 to 1946 (Coll. Works, Vol. 15 through 93)
- ↑ V. A. Sundaram's personal diaries and private correspondence are held by his daughter Saraswati Albano-Müller, residing in Schwelm, Germany (and other descendants)