Jump to content

వి.హనుమంతరావు

వికీపీడియా నుండి
వి. హనుమంతరావు
వి.హనుమంతరావు


వ్యక్తిగత వివరాలు

జననం (1948-06-16) 1948 జూన్ 16 (వయసు 76)
అంబర్‌పేట్, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్
సంతానం ముగ్గురు కుమార్తెలు
నివాసం హైదరాబాదు

వి. హనుమంతరావు లేదా ఉత్పల హనుమంతరావు కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో దాదాపు 50 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాడు[ఆధారం చూపాలి]. వరుసగా మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకి ఎన్నికై ఈఘనత సాధించిన ఐదవ ఆంధ్రుడిగా నిలిచాడు.ఏవిషయంలో ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు రాజ్యసభకి ఎన్నికకాబడిన ప్రకాశం జిల్లాకి చెందిన వి.సి.కేశవరావు అందరికన్నా ముందున్నారు.

బాల్యము

[మార్చు]

హనుమంతరావు హైదరాబాదు లోని అంబర్ పేట్ లో 1948, జూన్ 16 న లక్ష్మయ్య, రంగమ్మ దంపతులకు జన్మించాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ చదివారు.

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1980- 1984 ఎమ్మెల్సీగా ఎన్నిక
  • 1982-1983 వెనుకబడిన, గిరిజనసంక్షేమ శాఖ మంత్రి
  • 1992 - ఏప్రిల్ - రాజ్యసభకి ఎన్నిక
  • 2004-జూన్ రాజ్యసభకి ఎన్నిక
  • 2010- జూన్ రాజ్యసభకి ఎన్నిక

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వీరికి ముగ్గురు కుమార్తెలు.అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి.

వివాదాలు

[మార్చు]
  • 2011 జనవరి 11 న హైదరాబాదు లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సాక్షి పత్రిక ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు[1]

2013 తిరుపతి వివాదం

[మార్చు]

2013 ఆగస్టు 17, శనివారం, కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు తిరుమల వచ్చిన వి.హనుమంతరావు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఉండడానికి వీల్లేదని, ఒకవేళ ఉండాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని తిరుమలలో మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు నిరసన తెలిపేందుకు తిరుగుప్రయాణమైన వీహెచ్ వాహనాన్ని అలిపిరి వద్ద అడ్డుకున్నారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి నిరసనకారులు ప్రయత్నిస్తుండగానే.. పోలీసులు లాఠీచార్జికి దిగారు. దాంతో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి, వీహెచ్ వాహనాన్ని అక్కడినుంచి పంపేశారు. వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చెప్పారు.

తిరుమలలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ, సీమాంధ్ర అన్నదమ్ములుగా విడిపోదాం. ఒక్క ఉద్యోగులు మినహా హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు. ఆ ఉద్యోగులు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉండవచ్చు. రేషియో ప్రకారం ఉద్యోగులు పోయేటోళ్లు పోతారు. మిగతావారు ఉండొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్లను వెళ్లగొట్టరు. అది ఒక అపోహ మాత్రమే. వీ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ దెమ్’’ అని పేర్కొన్నారు. ఎన్జీవోల ఉద్యమాన్ని రాజకీయ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. వీహెచ్ వ్యాఖ్యలను తెలుసుకున్న కొందరు సమైక్యవాదులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి అలిపిరి టోల్‌గేటు వద్ద కాపుకాశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో సమైక్యవాదులు కారుకు అడ్డంగా పడుకుని వీహెచ్‌ను కిందికి దిగాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయన దిగకపోవడంతో, పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించేయత్నం చేశారు. అయినా.. వారు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి ప్రారంభించారు. అదేసమయంలో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరికి పోలీసులు వీహెచ్ కారును పంపించివేశారు. ఈ ఘటనలో పది మంది ఉద్యమకారులకు, ఒక పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వీహెచ్ వాహనాన్ని తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద, విమానాశ్రయం వద్ద కూడా అడ్డుకునేందుకు సమైక్యవాదులు యత్నించారు[2][3][4].

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 2010 జనవరి 11 సాక్షి వార్త
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-19. Retrieved 2013-08-19.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-19. Retrieved 2013-08-19.
  4. http://www.youtube.com/watch?v=Wz3QrRg8FGc