Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ

వికీపీడియా నుండి
ప్రాజెక్ట్ టైగర్ 2 రచనా పోటీ
2019 - 2020లో, వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ కలసి సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్), వికీమీడియా ఇండియా చాప్టర్, యూజర్ గ్రూపులతో సన్నిహితంగా సమన్వయం చేస్తూ స్థానికంగా ఆసక్తికరమైన, అత్యున్నత నాణ్యత కలిగిన సమాచారాన్ని భారతీయ భాషల్లో సృష్టించేందుకు వికీమీడియా సముదాయాలను ప్రోత్సహించేందుకు ఒక ప్రోగ్రాం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాం (అ) చురుకైన, అనుభవజ్ఞులైన వికీపీడియా వాడుకరులకు లాప్టాప్‌లు, అంతర్జాలం అందుబాటు కోసం స్టైఫండ్ అందించడం, (ఆ) వికీపీడియాలో ప్రస్తుతం లోటున్న సమాచారాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా భాష-ఆధారంగా పోటీ నిర్వహించడం.

ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ప్రదర్శించిన భారతీయ భాషా వికీపీడియా సముదాయాలు కలసి సమాచారంలో లోటును తగ్గించేందుకు రచనా పోటీని అభివృద్ధి చేస్తాయి. పాల్గొనే భాషా సముదాయాలు మూడు నెలల పాటు పోటీచేస్తాయి. అత్యుత్తమంగా కృషిచేసిన వారికి వ్యక్తిగత బహుమతులకు తోడు, గెలిచిన సముదాయం వికీపీడియాలో కృషిచేయడానికి ఉపకరించేలా ప్రత్యేకమైన సామర్థ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మద్దతు పొందుతుంది.

నియమాలు

క్లుప్తంగా చెప్పాలంటే, అక్టోబరు 2019 - జనవరి 2020 మధ్యకాలంలో కనీసం 9 వేల బైట్లు, 300 పదాలు, మూలాలతో ఇచ్చిన వ్యాసాల జాబితాలోని అంశాలు సృష్టించడం కానీ విస్తరించడం కానీ చేయండి.

  • వ్యాసాల్లో 2019 అక్టోబరు 10, 0:00 నుంచి 2020 జనవరి 10, 23:59 (భారత ప్రామాణిక కాలం) మధ్యలో దిద్దుబాటు చేయాలి.
  • వ్యాసం కనీసం 9వేల బైట్లతో, 300 పదాలతో ఉండాలి. ఆంగ్లంలో కనీసం 3వేల బైట్లతో, 300 పదాలతో ఉండాలి. (సమాచారపెట్టె, మూస, వగైరా మినహాయించి)
  • వ్యాసానికి తగిన మూలాలు ఉండాలి; వ్యాసంలోని సందేహాస్పద, వివాదాస్పద అంశాలను వ్యాసంలో చేర్చిన మూలాలతో నిర్ధారించాలి.
  • వ్యాసం పూర్తిగా యాంత్రికానువాదంతో ఏర్పడింది కాకూడదు, సరిగా సరిదిద్దాలి.
  • వ్యాసంతో ఏ ప్రధానమైన సమస్యలూ ఉండకూడదు (కాపీహక్కుల సమస్యలు, విషయప్రాధాన్యతకు సంబంధించిన సమస్యలు, వంటివి)
  • వ్యాసం సమాచారాన్ని అందించేదిగా ఉండాలి.
  • వ్యాసాలు ఇచ్చిన అంశాల జాబితాలోనిది (మెటాలో వ్యాసాల పేజీ) అయివుండాలి. మీరు ఒక వర్గం నుంచి మరిన్ని అంశాలు ఉండాలని భావిస్తే, చర్చ పేజీలో కోరండి. వీలున్నంత వరకూ చేరుస్తాం.
  • పోటీ నిర్వాహకుల్లో ఒకరు రాసి నివేదించిన వ్యాసాన్ని మిగతా నిర్వాహకులు సరిచూడాలి.
  • తమ భాషలోని పోటీకి వ్యాసం అంగీకరించదిగనదా కాదా అన్నది ఆయా భాష వికీపీడియా జడ్జి(లు) నిర్ధారిస్తారు.
  • జాబితాల్లోని గూగుల్ అనువాద వ్యాసాలు అభివృద్ధి చేయదలుచుకున్నవారు అనువాద సమస్యలు ఉన్న పాఠ్యం మొత్తాన్ని ఒకేమారు తొలగించి, తిరిగరాయవచ్చు. పూర్తిగా ఒకేమారు చేసిన తొలగింపు తర్వాత చేర్చిన 9 వేల బైట్లను, వ్యాసం మొత్తం నాణ్యతను పరిగణించి జడ్జిలు నిర్ణయిస్తారు.

బహుమతులు

  • ఒక్కో నెలలోనూ, పాల్గొనే ఒక్కో సముదాయం నుంచి ఆ నెలకు చేసిన కృషిని బట్టి మూడు వ్యక్తిగత బహుమతులు ప్రకటిస్తారు. ఈ బహుమతులు రూ.3000, రూ.2000, రూ.1000 విలువతో ఉంటాయి.[నోట్స్ 1]
  • మూడు-నెలల పాటు సాగే పోటీ చివరిలో, అత్యధిక సంఖ్యలో వ్యాసాలు సృష్టించిన లేక విస్తరించిన సముదాయం, సముదాయ బహుమతి గెలుచుకుంటుంది. గెలిచిన సముదాయం వికీపీడియాలో కృషిచేయడానికి ఉపకరించేలా ప్రత్యేకమైన 3-రోజుల సామర్థ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మద్దతు పొందుతుంది.
  • భారతీయ భాషా వికీపీడియా సముదాయాలతో పోలిస్తే భారతదేశంలో ఆంగ్ల వికీపీడియా సముదాయ సంఖ్యలో భారీ భేదం ఉండడంతో సముదాయ పోటీలో బహుమతికి ఆంగ్ల వికీపీడియాను పరిగణించట్లేదు. ఐతే ఆంగ్ల వికీపీడియన్లు వ్యక్తిగత బహుమతుల కోసం పోటీచేయవచ్చు.

చేరండి

11:59 PM IST 2020 జనవరి 10లోగా ఎప్పుడైనా చేరవచ్చు.

వ్యాసాలను నివేదించండి

ప్రాజెక్టు టైగరు కోసం తెలుగు వికీపీడియాలో కృషిచేశారా? ఐతే మీ కృషిని ఫౌంటైన్ ఉపకరణంలో నివేదించండి.

ఫౌంటైన్లో నివేదించడంలో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్టైతే, దయచేసి మీ సమస్యను ఈ కార్యక్రమ చర్చాపేజీలో తెలియజేసి, మళ్ళీ ప్రయత్నించండి. మీరు ఇంకా సమస్యలు ఎదర్కొంటున్నట్టైతే, వ్యాసాలు ఇక్కడ చేర్చవచ్చు.

నిర్వాహకులు

తరచు అడిగే ప్రశ్నలు

1. ఈ ప్రాజెక్టులో వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ సంస్థల పాత్ర ఏమిటి?

గూగుల్ మరియు వికీమీడియా ఫౌండేషన్ అంతర్జాంలో భారతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండడం అన్న అంశంపై ఆసక్తి కలిగివున్నాయి. ఈ విషయానికి మద్దతునివ్వడంలో ఒకరినొకరు విలువైన భాగస్వాములుగా చూశాయి. గూగుల్ ఈ ప్రాజెక్టు యొక్క పైలట్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును ఒక గ్రాంట్ ద్వారా అందిస్తూ సాయం చేస్తోంది. అలానే గూగుల్ వారు భారతీయ భాషల అంతర్జాల వినియోగదారులు చదివేందుకు వెతుకుతున్న అంశాల గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.

2. ఈ పోటీలో సీఐఎస్, వికీమీడియా ఇండియా చాప్టర్, యూజర్ గ్రూపులు, సముదాయాల పాత్ర ఏమిటి?

వికీపీడియా ఏషియన్ నెల, పంజాబ్ ఎడిటథాన్ వంటివాటి మోడల్ ఆధారంగా పోటీని సంబంధిత భాషా వికీపీడియా సముదాయాలు సమన్వయం చేస్తాయి.

సీఐఎస్-ఎ2కె బహుమతుల పంపిణీ, గెలుపొందిన సముదాయానికి శిక్షణా కార్యక్రమ నిర్వహణ చేస్తుంది.

వికీమీడియా ఇండియా చాప్టర్, యూజర్ గ్రూపులు సముదాయాలు, వ్యక్తులు పాల్గొనేలా చేసేందుకు అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.

సముదాయాలు తమలో తాము పోటీని రూపకల్పన చేసి, నిర్వహించి సమన్వయం చేస్తాయి. సముదాయాలు, వ్యక్తులు పాల్గొనేలా చేసేందుకు అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా చేయవచ్చు.

3. పోటీలో పాల్గొనడం తప్పనిసరా/పరిమితమైనదా/షరతులకు లోబడినదా?

లేదు. ఐతే, మీరు పాల్గొనేందుకు ఆసక్తిగా ఉంటే, మీ సముదాయంలో నాయకత్వం వహించి, సమన్వయం చేయవచ్చు. వికీపీడియాలో ఇలాంటి పేజీని ప్రారంభించడం ద్వారా మొదలుపెట్టవచ్చు. మీకేదైనా సాయం కావాలంటే చర్చ పేజీలో సందేశం రాయండి.

4. మా ఆసక్తులకు అనుగుణమైన వ్యాసాలు సృష్టించవచ్చా?

ఈ కార్యక్రమం ప్రత్యేకించి భారతీయ భాషల వికీపీడియాలలో ప్రస్తుతం లేనివి, పలువురు వినియోగదారులు అంతర్జాలంలో ఆశిస్తున్నవీ అయిన వ్యాసాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ దృష్టి వల్ల మేం చాలామంది ప్రజలకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందించగలమని నమ్ముతున్నాం. తద్వారా మీరు ఈ జాబితాలో మీకు ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకోగలరని ఆశిస్తున్నాం. ఐతే సముదాయం ఏదైనా వర్గాన్ని ఎంచుకుంటే దానిలో అంతర్గత ఫోకస్ తో మరిన్ని అంశాలను చేర్చడానికి చాలా ఉత్సాహం చూపుతున్నాం. ఉదాహరణకు సముదాయం ఆరోగ్యం, రాజకీయం లేదా ప్రస్తుత ఘటనలకు సంబంధించిన అంశాలు కావాలంటే, ఈ వర్గాల్లో మరిన్ని అంశాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం.

5. దీన్ని ప్రాజెక్ట్ టైగర్ అని ఎందుకు పిలుస్తున్నారు?

ఈ ప్రాజెక్టు భారతదేశంలో పులులను రక్షించడానికి చేపట్టిన ఒక ప్రాజెక్టు నుంచి స్ఫూర్తిని తీసుకోవడంతో, దీనికి అదే పేరు పెట్టాం. ఆ ప్రాజెక్టు టైగర్ లో పర్యావరణ దృష్టిని పోల్చుతూ, ఈ పైలట్ ప్రాజెక్టు కూడా భారతీయ భాషల వికీపీడియన్లు స్థానికంగా ఉపకరించే సమాచార సృష్టి చేయడంలో నేపథ్యాన్ని అర్థంచేసుకుంటూ, దాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తోంది.

నోట్స్

  1. తెలుగు వికీపీడియాలో జరిగిన చర్చ, నిర్ణయం ప్రకారం ఈ బహుమతులు పుస్తక రూపంలో ఉంటాయి. ఈ విలువకు తమకు ఆసక్తి కలిగిన పుస్తకాలను విజేతలే ఎంచుకోవచ్చు.

ఉపకరించే లింకులు

వ్యాస చర్చాపేజీలో వాడుటకు ప్రాజెక్టు మూసలు

[మార్చు]

Onsite edit-a-thon

[మార్చు]

Statistics

[మార్చు]

Fountain tool

[మార్చు]

Please use these links

Instruction for jury

[మార్చు]
  • Post successful-vetting of an article that has been created / expanded under the purview of the contest;
    • Please add the following template to a newly created page:
      • {{Project Tiger 2019|created=yes}}
    • Please add the following template to an expanded page:
      • {{Project Tiger 2019|expanded=yes}}

ఇవీ చూడండి

[మార్చు]