విసర్జన
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
జీవ క్రియలు జరిగినప్పుడు అనేక రసాయనిక చర్యలు జరిగి ఉపయోగము లేని, హానికరమైన, అనేక అనుషంగిక పదార్ధాలు ఉత్పత్తి అవుతాయి. వీటిలో కొన్ని పదార్ధాలను తప్పనిసరిగా బయటకు పంపవలసి ఉంటుంది. ఇలా అవసరము లేని మలిన పదార్ధాలను దేహము నుండి వేరుచేసి బయటకు పంపించే విధానాన్ని విసర్జన (Excretion) అంటారు.
విసర్జన పదార్ధాలు అనేక రకాలు. ఇవి జీవికి జీవికి, ఒకే జీవిలో కూడా వేర్వేరు రకాలుగా ఉంటాయి. కార్బర్ డై ఆక్సైడ్, జీర్ణం కాని ఆహార పదార్ధాలు, అధిక నీరు, లవణాలు, జీవక్రియలో ఉత్పత్తి అయ్యే నత్రజని సంబంధిత పదార్ధాలు ముఖ్యమైన విసర్జన పదార్ధాలు.
ప్రక్రియలు
[మార్చు]- మాంసకృత్తుల జీవక్రియలో ఉత్పత్తి అయ్యే నత్రజని సంబంధిత మలిన పదార్ధాలను బయటకు పంపించడం.
- శరీర సమతాస్థితిని, ద్రవాభిసరణ గాఢతను క్రమపరచడం.
- శరీరంలోని ద్రవాల వేర్వేరు అయానుల గాఢతను క్రమపరచడం.
- రక్తము యొక్క pH ను క్రమపరచడం.
- నీటి పరిమాణం, శరీరంలోని ద్రవాల పరిమాణాన్ని క్రమపరచడం.
పబ్లిక్ టాయ్లెట్లు వాడినందుకు తిరుచిరాపల్లికి చెందిన సొసైటీ ఫర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మనకే డబ్బులిస్తోంది .ఒక్కసారికి పదిపైసల చొప్పున లెక్కకట్టి నెలవారీ చెల్లింపులు చేస్తూ ఆ సంస్థ మానవ మలమూత్రాలను ఎరువుగా వాడుతుంది.
విసర్జన పదార్ధాల ఆధారంగా జీవుల వర్గీకరణ
[మార్చు]జీవులలో స్వేచ్ఛా నత్రజని ఉత్పత్తి కాదు. కాని నత్రజని కలిగిన అంత్య జనకాలైన అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లము ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన నత్రజని సంబంధిత మలిన పదార్ధాలను ఆధారంగా చేసుకొని జీవులను నాలుగు సముదాయాలుగా వర్గీకరణ చేశారు.
- అమోనోటెలిక్ జీవులు (Ammonotelic animals) : నత్రజని అమోనియా (Ammonia) రూపంలో విసర్జించే జీవులను అమోనోటెలిక్ జివులు అంటారు. అమోనియా నీటిలో బాగా కరిగి శరీర ఉపరితలం నుండి పరిసర జలాలలోనికి త్వరగా వ్యాపనము చెందుతుంది. నీటిలో నివసించే సకశేరుకాలు అధిక ప్రమాణంలో అమోనియాను విసర్జిస్తాయి. రక్తంలో యూరియా నిలువవుంటే హానికరము. కాబట్టి ఇది జలవిశ్లేషణ చెందటం వలన అమోనియా ఏర్పడుతుంది. మంచినీటిలో నివసించే చాలా చేపలు కొంచెము పరిమాణంలో యూరియా విసర్జించినప్పటికీ అవి అమోనోటెలిక్ జీవులు. ఇవి మొప్పల ఉపరితలం గుండా వ్యాపనం చెందుతాయి. ఆర్థ్రోపోడా జీవులలో క్రస్టేషియన్ లలో అమోనియా రూపంలోనే విసర్జన జరుగుతుంది.
- యూరియోటెలిక్ జీవులు (Ureotelic animals) : నత్రజని యూరియా (Urea) రూపంలో విసర్జించు జీవులను యూరియోటెలిక్ జీవులు అంటారు. భూమి మీద నివసించే జీవులకు నీరు పుష్కలంగా లభించక పోవడం వలన జల జీవుల వలె అమోనియాను విసర్జించలేవు. కాబట్టి ఉభయచరాలు, క్షీరదాలు అమైనో ఆమ్లాలలోని నైట్రోజన్ కాలేయములో ఉత్పత్తి చేసుకొని మూత్రపిండాల ద్వారా విసర్జిస్తాయి. ఈ జీవులకు యూరియా కరిగించడానికి మూత్రము రూపములో విసర్జించడానికి కొంచెమే నీరు అవసరమౌతుంది. ఈ విధంగా అమోనోటెలిక్ నుండి యూరియోటెలిక్ గా మారడం అనేది లభించే నీటిని బట్టి ఉంటుంది.
- యూరికోటెలిక్ జీవులు (Uricotelic animals) : నత్రజని యూరిక్ ఆమ్లం రూపంలో విసర్జించే జీవులను యూరికోటెలిక్ జీవులు అంటారు. యూరిక్ ఆమ్లం నత్రజని చక్రములో చివరి దశ. ఇది నీటిలో కరగదు. అకశేరుకాలలో కీటకాలు, సకశేరుకాలలో బల్లులు, పాములు, సరీసృపాలు యూరికోటెలిక్ జీవులు.
- గ్వానోటెలిక్ జీవులు (Guanotelic animals) : ఆర్థ్రోపోడాలో సాలె పురుగులు నత్రజనిని గ్వానిన్ రూపంలో విసర్జిస్తాయి. దీని ద్వావణీయత యూరికామ్లం కన్నా ఎంతో తక్కువ. ఇది ఘనపదార్ధంగా విసర్జితమవుతుంది.