శంభో శంకర
Appearance
శంభో శంకర | |
---|---|
దర్శకత్వం | ఎన్. శ్రీధర్ |
నిర్మాత | రమణా రెడ్డి, సురేశ్ కొండేటి |
తారాగణం |
|
సంగీతం | సాయి కార్తీక్ |
విడుదల తేదీ | 2018 జూన్ 29 |
సినిమా నిడివి | 168 minutes |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శంభో శంకర 2018 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ హాస్య నటుడు షకలక శంకర్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యాడు.
కథ
[మార్చు]కడప జిల్లా అంకాలమ్మ పల్లె గ్రామంలో కథ మొదలవుతుంది. ఆ ఊరికి రాబందు లాంటి సర్పంచు అజయ్ ఘోష్. ఆ సర్పంచుకు తోడు గా ఓ అవినీతి పోలీసు అధికారి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా ఉంటాడు శంకర్ (షకలక శంకర్). ఇక ఈ కథనంలో ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి). సర్పంచు కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్ ఆ సర్పంచు కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. సర్పంచు పెత్తనాన్ని ప‍్రశ్నిస్తూ శంకర్ ఊరి ప్రజలకు అండగా నిలబడతాడు. అయితే కథలో సర్పంచు కంటే పెద్దదొంగ ఒకడు ఉంటాడు. అతడికి శంకర్‌కి మధ్య సంబంధం ఏమిటి? అసలైన ఆ గజదొంగ ఎవరు? అనేది మిగిలిన కథలో భాగం [1]
తారాగణం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం : సాయి కార్తీక్
- దర్శకత్వం : ఎన్. శ్రీధర్
- నిర్మాత : రమణా రెడ్డి, సురేశ్ కొండేటి