సంధ్యా రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంధ్యా రే
సంధ్యా రే


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు భగీరథ్ ప్రసాద్
నియోజకవర్గం భిండ్

పదవీ కాలం
2003 – 2008
తరువాత శివమంగళ్ సింగ్ తోమర్
నియోజకవర్గం దిమాని

వ్యక్తిగత వివరాలు

జననం (1974-01-04) 1974 జనవరి 4 (వయసు 50)
కమ్రా, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
సుమన్ రే
(m. 1984)
సంతానం 3
పూర్వ విద్యార్థి జివాజీ విశ్వవిద్యాలయం; బర్కతుల్లా విశ్వవిద్యాలయ, భోపాల్ & ప్రభుత్వ రాష్ట్ర స్థాయి న్యాయ కళాశాల, భోపాల్
(ఎంఏ, ఎల్‌ఎల్‌బీ)
మూలం [1]

సంధ్యా రే (జననం 4 జనవరి 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె భిండ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సంధ్యా రే తన భర్త సుమన్‌రే అడుగుజాడల్లో 1995లో బీజేపీలో చేరి రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. ఆమె 2000లో మొరెనా జిల్లాలోని అంబాహ్‌లో రైతు మార్కెట్ అధ్యక్షురాలిగా ఎన్నికై, 2003లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దిమాని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

సంధ్యా కు ఆ తర్వాత బీజేపీ టిక్కెట్ దక్కకపోయినా పార్టీ కార్యకర్తగా, వివిధ హోదాల్లో పని చేస్తూ 2017లో మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైంది. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భింద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి దేవాశిష్ జరారియాపై 1,99,865 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3]

సంధ్యా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భింద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ఫూల్ సింగ్ బరయ్యాపై 64,840 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Sandhya Rai" (in ఇంగ్లీష్). Retrieved 6 August 2024.
  2. Feminism in India (1 September 2020). "How Sandhya Ray Became The First Female MP From Bhind in Madhya Pradesh". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  3. TimelineDaily (21 March 2023). "BJP Is Confident In Sandhya Ray From Bhind-Datia Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  4. The Times of India (7 June 2024). "Bhind election results 2024 live updates: BJP's Sandhya Ray wins". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhind". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=సంధ్యా_రే&oldid=4302417" నుండి వెలికితీశారు