సింగపూర్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగపూర్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయం గోపురం (ప్రవేశ గోపురం)పై ద్రావిడ హిందూ కళ.

సింగపూర్‌లో హిందూ మతం, సంస్కృతి సా.శ. 7వ శతాబ్దంలో టెమాసెక్ హిందూ-బౌద్ధ శ్రీవిజయ సామ్రాజ్యానికి వ్యాపార స్థావరంగా ఉన్నప్పటి నుండి ఉందని గుర్తించవచ్చు. ఒక సహస్రాబ్ది తరువాత, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వలస బ్రిటీష్ సామ్రాజ్యాలు దక్షిణ భారతదేశం నుండి అనేక మంది వలసదారులు సింగపూర్‌కు కూలీలుగాను, ఒప్పంద కార్మికులు గానూ తీసుకువచ్చాయి. మలయ్ ద్వీపకల్పంలో లాగానే, బ్రిటిష్ పరిపాలకులు దాని ప్రాంతీయ తోటల పెంపకంలోను, వ్యాపార కార్యకలాపాలలోనూ నమ్మకమైన శ్రామిక శక్తిని స్థిరీకరించడానికి ప్రయత్నించింది; కంగానీ వలస వ్యవస్థ ద్వారా హిందువులు కుటుంబాన్ని తీసుకురావడం, స్థిరపడడం, దేవాలయాలను నిర్మించడం చేసి ఒక సమాజంగా ఏర్పడ్డారు. అదే తరువాత లిటిల్ ఇండియాగా మారింది.

ప్రస్తుతం సింగపూర్‌లో దాదాపు ముప్పై ప్రధాన హిందూ దేవాలయాలు ఉన్నాయి. 2020 జనాభా లెక్కల ప్రకారం సింగపూర్‌లో 1,72,963 మంది హిందువులు ఉన్నారని అంచనా వేసాఉ., ఇది సింగపూర్ జనాభాలో 5.0%.[1][2][3] సింగపూర్‌లో ఉన్న హిందువులు దాదాపు అందరూ జాతిపరంగా భారతీయులే (99%). వీరిలో కొందరు హిందూ కుటుంబాలలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 1931లో హిందూమతస్థులు మొత్తం జనాభాలో 5.5%కి చేరుకున్నారు [4]

సింగపూర్‌లో, హిందువుల పండుగ దీపావళిని జాతీయ ప్రభుత్వ సెలవుదినంగా గుర్తిస్తారు. కొంతమంది భారతీయేతరులు, సాధారణంగా బౌద్ధ చైనీయులు, వివిధ హిందూ కార్యక్రమాలలో పాల్గొంటారు. మలేషియా, ఇండోనేషియాల్లోని వివిధ రాష్ట్రాల మాదిరిగా కాకుండా, సింగపూర్లో హిందువుల మత స్వేచ్ఛపై ఎటువంటి ఆంక్షలు లేవు.

జనాభా వివరాలు

[మార్చు]
సంవత్సరం శాతం పెంచు
1849 2.8% -
1911 5.0% +2.2%
1921 4.6% -0.4%
1931 5.5% +0.9%
1980 3.6% -1.9%
1990 3.7% +0.1%
2000 4.0% +0.3%
2010 5.1% +1.1%
2015 4.96% -0.14%
2020 5.0% +0.04%

2020లో హిందువులుగా నమోదైన జాతి సమూహం.[2] సింగపూర్ జనాభా లెక్కల ప్రకారం పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, శ్రీలంకేయులు మొదలైన వారందరినీ భారతీయ జాతి వర్గం కిందనే లెక్కించడం వల్ల ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధమతాలను అనుసరించే భారతీయుల సంఖ్య హిందువుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది.[5]

సాంప్రదాయిక సంఘం హిందువులుగా నమోదైన వారి సంఖ్య హిందువులుగా నమోదైన వారి శాతం మొత్తం జనాభాలో జాతి జనాభా శాతం జాతి సమూహపు మొత్తం జనాభా
చైనీయులు 458 0.018% 75.36% 26,06,881
మలేయులు 223 0.05% 12.94% 4,47,747
భారతీయులు 171,326 57.29% 8.65% 2,99,056
ఇతరులు 956 0.91% 3.05% 1,05,410
మొత్తం 172,963 5.00% 100% 34,59,093

2015లో హిందువులుగా నమోదు చేయబడిన నివాస జాతి సమూహం.[6]

సాంప్రదాయిక సంఘం హిందువులుగా నమోదైన వారి సంఖ్య హిందువులుగా నమోదైన వారి శాతం మొత్తం జనాభాలో జాతి జనాభా శాతం జాతి సమూహపు మొత్తం జనాభా
చైనీయులు 300 0.012% 76.84% 25,17,580
మలేయులు 100 0.03% 11.88% 3,89,090
భారతీయులు 161,800 59.88% 8.25% 2,70,220
ఇతరులు 400 0.403% 3.03% 99,300
మొత్తం 162,600 4.964% 100% 32,76,190

చరిత్ర

[మార్చు]
శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయ ప్రవేశం.

సింగపూర్‌లోని హిందూ మతం, సంస్కృతి ఉనికి 7వ శతాబ్దపు హిందూ శ్రీవిజయ సామ్రాజ్యం నాటిదిగా గుర్తించవచ్చు. అప్పట్లో టెమాసెక్ చిన్న వర్తక కేంద్రంగా ఉండేది. 10వ శతాబ్దం నాటికి, తమిళ చోళ ప్రభావం వచ్చింది. 14 నుండి 17వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో ఇస్లాం విస్తరణతో, సింగపూర్ చుట్టుపక్కల హిందూ-బౌద్ధ ప్రభావం క్షీణించింది. వలసవాద యుగం ఈ ప్రాంతంలో అధికారం, మతపరమైన ప్రభావాలలో పెద్ద మార్పులను తీసుకువచ్చింది.

19వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ భారతదేశం నుండి సింగపూర్‌కు హిందువులు బాగా వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది తమిళులు. సింగపూర్‌లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కూలీలుగా, కార్మికులుగా పని చేయడానికి వీరిని తీసుకువచ్చారు. ఈ వలసదారులు తమ మతాన్ని, సంస్కృతినీ తీసుకువచ్చారు. వారి రాకతో ద్వీపం అంతటా ద్రావిడ శైలిలో దేవాలయాలను నిర్మించడం, శక్తివంతమైన హిందూ సంస్కృతికి నాంది పలకడం జరిగింది.

కొత్త దేశంలో వారి మతాన్ని పరిచయం చేయడానికి, దాన్ని సంరక్షించడానికీ కార్మికులు ఎక్కువగా బాధ్యత వహించినప్పటికీ, తరువాతి కాలంలో, ధనిక హిందూ వ్యాపారులు వారి ప్రార్థనా స్థలాలను నిర్మించడానికి ద్రవ్య విరాళాలు అందించారు.

మొదటి హిందూ దేవాలయం

[మార్చు]
శ్రీ మారియమ్మన్ దేవాలయం, సింగపూర్

సింగపూరులో మొదటి ఆలయం, చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయం, 1827లో సర్ స్టాంఫోర్డ్ రాఫెల్స్‌కు గుమస్తాగా ఉన్న నారాయణ పిళ్లై నిర్మించాడు; ఇది మాతృ దేవత అవతారమైన మారియమ్మన్‌ది. అతను మొదట 1823లో కొనుగోలు చేసిన ఈ స్థలంలో చెక్కతో, గడ్డితో చేసిన గుడిసెను నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న ఆలయం 1863 నాటికి పూర్తయింది.

సింగపూర్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంతో పాటు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం, శ్రీ దండాయుధపాణి ఆలయాలు ఇక్కడి జాతీయ కట్టడాల జాబితాలో ఉన్నాయి.[7]

సింగపూర్‌లోని హిందూ దేవాలయాలను ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ శైలి దాని గంభీరమైన ' గోపురాలు ' లేదా ప్రవేశ గోపురాలు, గోడలు, పైకప్పులపై చేసిన క్లిష్టమైన చెక్కడాలు, పెయింటింగ్‌లు లేదా కుడ్యచిత్రాలకు ప్రసిద్ధి చెందింది.

ప్రస్తుతం సింగపూర్‌లో దాదాపు ముప్పై ప్రధాన ఆలయాలు ఉన్నాయి, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్, హిందూ మహాజన సంగం, ది హిందూ అడ్వైజరీ బోర్డ్ అనే ప్రభుత్వ సంస్థలు హిందూ వ్యవహారాలతో వ్యవహరిస్తాయి.

హిందువులు మైనారిటీగా ఉన్నారు. 2010 జనాభా లెక్కల ప్రకారం వయోజన సింగపూర్ పౌరులు శాశ్వత నివాసితుల్లో 5.1% ఈరు 5.1% ఉన్నారు. సింగపూర్ 2010 జనాభా లెక్కల ప్రకారం 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో దాదాపు 1,58,000 మంది హిందువులు ఉన్నారు; సింగపూర్‌లోని హిందువుల్లో 37% మంది ఇంట్లో తమిళం మాట్లాడుతుండగా, మరో 42% మంది ఇంగ్లీష్ మాట్లాడతారు.[8] సింగపూర్‌లోని హిందువులలో అత్యధికులు దక్షిణ భారతీయులు. భారతీయులు కాని హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారు. వీరు ప్రధానంగా హిందూ కుటుంబాలు దత్తత తీసుకున్న లేదా పెళ్ళి చేసుకున్న చైనా, మలయ్ మహిళలు ప్రధానంగా ఉంటారు.

సింగపూర్‌లో వివిధ సమాజాలు తమ సొంత దేవాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఉదాహరణకు, శ్రీలంక తమిళ సంఘం సిలోన్ రోడ్‌లో శ్రీ సేన్‌పగ వినాయగర్ ఆలయాన్ని స్థాపించుకున్నారు. చెట్టియార్ సంఘం ట్యాంక్ రోడ్‌లో శ్రీ దండాయుధపాణి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఉత్తర భారత సమాజం ఉత్తర భారత శైలిలో శ్రీ లక్ష్మీనారాయణ ఆలయాన్ని స్థాపించారు.

సింగపూర్‌లో బౌద్ధ చైనీయుల వంటి అనేకమంది భారతీయేతరులు హిందూ దేవతలను ప్రార్థించడం, ఆలయ నిధులకు డబ్బు విరాళం ఇవ్వడం, దీపావళి, అగ్ని నడక వేడుక, తైపూసం వంటి హిందూ పండుగలలో పాల్గొనడం వంటివి చేస్తూంటారు. వాటర్లూ స్ట్రీట్‌లోని శ్రీ కృష్ణన్ ఆలయం లేదా యిషున్‌లోని కొన్ని హిందూ దేవాలయాల వంటి కొన్ని ఆలయాలకు చైనీయుల సమాజంలో గణనీయమైన అనుచరులున్నారు. చైనీయులు తమ దేవాలయాలకు వెళ్లేటప్పుడు తరచూ ఈ దేవాలయాలను కూడా సందర్శిస్తారు.

హిందూ పండుగలు

[మార్చు]
తైపూసంలో పాల్గొనే వ్యక్తి.

ప్రతి సంవత్సరం జరుపుకునే కొన్ని ప్రధాన హిందూ పండుగలలో దీపావళి (దీపావళి), తైపూసం, పొంగల్, తమిళ నూతన సంవత్సరం లేదా వర్ష పిరప్పు, హోలీ, తిమితి (ఫైర్ వాకింగ్ ఫెస్టివల్) ఉన్నాయి.

సింగపూర్‌లో దీపావళి ప్రభుత్వ సెలవుదినం.[9] క్రైస్తవులు, ముస్లింలకు ఒక్కొక్కరికి రెండు సెలవులు ఉన్నందున, తైపూసాన్ని ప్రభుత్వ సెలవుదినంగా మార్చాలని హిందువులు ప్రభుత్వాన్ని కోరారు.[10][11]

చిత్రమాలిక

[మార్చు]

జనవరి 2018లో భారతదేశం తెలంగాణ ప్రభుత్వంలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ & థియేటర్ ద్వారా అంతర్జాతీయ రామాయణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రవీంద్ర భారతిలో సింగపూర్ అప్సరస్ ఆర్ట్స్ గ్రూప్ ఆంజనేయం ప్లే ప్రదర్శించారు.

ఇవి్భం కూడా చూడండి

[మార్చు]
  • 1915 సింగపూర్ తిరుగుబాటు
  • సింగపూర్ భారతీయుల చరిత్ర
  • భారతీయ డయాస్పోరా
  • సింగపూర్‌లో ఇండియన్ నేషనల్ ఆర్మీ

మూలాలు

[మార్చు]
  1. "Census of Population 2020: Religion" (PDF). Department of Statistics Singapore. 16 June 2021. Retrieved 25 June 2021.
  2. 2.0 2.1 ""Religion by Ethnic in Singapore 2020"". Archived from the original on 2021-06-17. Retrieved 2021-06-18. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "2020Census" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Table: Religious Composition by Country, in Numbers Pew Research Center (2012)
  4. Lai Ah Eng, Religious Diversity in Singapore, Institute of Southeast Asian Studies, 2008.
  5. "Full report of 2021 Census" (PDF). p. 213. Retrieved 2021-06-28.
  6. ""Religion by Ethnic in Singapore 2015"". Archived from the original on 2017-08-13. Retrieved 2017-11-01.
  7. "PLACES - NATIONAL MONUMENTS". Archived from the original on 2020-07-17. Retrieved 2021-11-25.
  8. Census of population 2010 Archived 2013-11-13 at the Wayback Machine Singapore Department of Statistics (2011)
  9. "Singapore Public Holidays 2018".
  10. AsiaOne.com
  11. "Declare Thaipusam as a Holiday". 31 January 2017.