Jump to content

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

వికీపీడియా నుండి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
2016 లో ఎం.ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం ప్రీమియర్‌లో రాజ్‌పుత్
జననం(1986-01-21)1986 జనవరి 21 [1]
మరణం2020 జూన్ 14(2020-06-14) (వయసు 34)[3]
మరణ కారణంఆత్మహత్య
విద్యాసంస్థఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ
వృత్తిసినీ నటుడు
క్రియాశీల సంవత్సరాలు2008–2020
వెబ్‌సైటుhttps://selfmusing.com/

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (21 జనవరి 1986 - 14 జూన్ 2020) హిందీ సినీ నటుడు. రాజ్‌పుత్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించాడు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించాడు. దాని తరువాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట (2009–11) లో నటించాడు.

రాజ్‌పుత్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితరుకు మొట్టమొదటగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు.

మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యుఇపి) ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పాలసీ థింక్-ట్యాంక్ ఎన్‌ఐటిఐ ఆయోగ్, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నటన, ఇన్సాయ్ వెంచర్స్ అనే కంపెనీ నడపటంతో పాటు యువ విద్యార్థులకు సహాయం చేయటానికి రాజ్‌పుత్ సుషాంత్4ఎడ్యుకేషన్ లాంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. జూన్ 2020 లో, 34 సంవత్సరాల వయసులో, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్వరంగం

[మార్చు]

రాజ్‌పుత్ పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు జన్మించారు. అతని పూర్వీకుల నివాసం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఉంది. అతని సోదరీమణులలో ఒకరు మితు సింగ్ రాష్ట్ర స్థాయి క్రికెటర్. 2002 లో అతని తల్లి మరణించారు. అదే సంవత్సరంలో రాజ్‌పుత్ కుటుంబం పాట్నా నుండి ఢిల్లీ వెళ్లింది.

రాజ్‌పుత్ పాట్నా లోని సెయింట్ కరెన్స్ హై స్కూల్లో, న్యూ ఢిల్లీ లోని కులాచి హన్సరాజ్ మోడల్ స్కూల్ లో చదువుకున్నాడు. అతని ప్రకారం, డిసిఇ ఎంట్రన్స్ పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించడంతోపాటు అదే కళాశాలలో బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నాడు. అతను థియేటర్, నృత్యాలలో పాల్గొనడం ప్రారంభించిన తరువాత, చాలా అరుదుగా అధ్యయనాలకు సమయం కేటాయించగలిగాడు. దీని ఫలితంగా అనేక బ్యాక్‌లాగ్‌లు వచ్చి, చివరికి అతన్ని డిసిఇ నుండి వెళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నటనా వృత్తిని కొనసాగించడానికి ముందు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో మూడేళ్ళు మాత్రమే పూర్తి చేశాడు.

సినీ జాబితా

[మార్చు]
Key
ఇంకా విడుదల కాని సినిమాలు
విడుదలైన సంవత్సరం పేరు పాత్ర విశేషాలు
2013 కాయ్ పో చె ఇషాన్ భట్ [4]
శుద్ధ్ దేశీ రొమాన్స్ రఘు రామ్ [5]
2014 పికె సర్ఫరాజ్ యూసఫ్ [6]
2015 డిటెక్టివ్ బ్యోమ్కేష్ భక్షి డిటెక్టివ్ బ్యోమ్కేష్ భక్షి [7]
2016 ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ మహేంద్ర సింఘ్ ధోని [8]
2017 రాబ్తా జిలాన్/శివ కక్కర్ [9]
2018 వెల్కమ్ టు న్యూ యార్క్ అతడే [10]
కేదార్నాథ్ మన్సూర్ ఖాన్ [11]
2019 సొంచిరియా లఖన్ "లఖ్నా" సింఘ్ [12]
చిచోరే అనిరుధ్ [13]
డ్రైవ్ సమర్ [14]
2020 దిల్ బెచారా † మాని [15]

టెలివిజన్

[మార్చు]
విడుదలైన సంవత్సరం పేరు పాత్ర విశేషాలు
2008–2009 కిస్ దేశ్ మె హే మేరా దిల్ ప్రీత్ జునేజా [16]
2009–2011 పవిత్ర రిష్తా మానవ్ దేశముఖ్ [16]
2010 జర నచ్కే దిఖా పోటీదారుడు టీం "మస్త్ కలందర్ బాయ్స్"
2010–2011 ఝలక్ దిక్లా జా 4 పోటీదారుడు ద్వితియ విజేత

మరణం

[మార్చు]

2020 జూన్ 14 న అతను ముంబయి లోని బాంద్రా ప్రదేశంలో గల తన స్వగృహంలో తుది శ్వాస వదిలాడు [17]. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నదే మొదటి నుండి సర్వత్రా కలిగిన అభిప్రాయం [18] . అధికారిక పోస్టుమార్టం నివేదికలు కూడా ఊపిరి అందకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించాయి. పలు పుకార్లు, అనుమానాల మధ్య ముంబయి పోలీసు విభాగం ఈ హఠాన్మరణాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించింది.[19]

మూలాలు

[మార్చు]
  1. Shruti Shiksha (21 January 2018). "'Happy Birthday, Sushant Singh Rajput. Keep That Childlike Smile Always Alive,' Tweets Kriti Sanon". NDTV. Retrieved 6 December 2018.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; time_Madh అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "Sushant Singh Rajput dies by suicide at 34 in Mumbai". India Today. 14 June 2020. Retrieved 14 June 2020.
  4. "Popular Bollywood actor Sushant Singh Rajput, star of 'Kai Po Che,' found dead". Los Angeles Times (in అమెరికన్ ఇంగ్లీష్). 14 June 2020. Retrieved 14 June 2020.
  5. Kanyal, Jyoti (14 June 2020). "Parineeti Chopra on Shuddh Desi Romance co-star Sushant Singh Rajput's death: Will miss you buds". India Today (in ఇంగ్లీష్). Retrieved 14 June 2020.
  6. "Sushant Singh Rajput's PK Co-Star Anushka Sharma: "Too Young And Brilliant To Have Gone So Soon"". NDTV.com. Retrieved 14 June 2020.
  7. "Sushant Singh Rajput: An actor who preferred quality over quantity". The Week (in ఇంగ్లీష్). Retrieved 14 June 2020.
  8. Dc, Chitrangada (14 June 2020). "How Sushant Singh Rajput trained for MS Dhoni – The Untold Story: WATCH". mykhel.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూన్ 2020. Retrieved 14 June 2020.
  9. Bureau, ABP News (14 June 2020). "Sushant Singh Rajput Suicide: Arjun Bijlani Shares Screenshot Of His LAST Message To 'Raabta' Actor". news.abplive.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూన్ 2020. Retrieved 14 June 2020.
  10. "'Welcome To New York' movie review: Trips on a tactless plot". The New Indian Express. Archived from the original on 3 అక్టోబరు 2019. Retrieved 14 June 2020.
  11. "Sushant Singh Rajput's Co-Star Sara Ali Khan Shares Kedarnath Memory. No Caption Needed". NDTV.com. Retrieved 14 June 2020.
  12. "Sushant Singh Rajput passes away: From Kai Po Che to Sonchiriya, a look at the actor's iconic performances- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 14 June 2020. Archived from the original on 14 జూన్ 2020. Retrieved 14 June 2020.
  13. "'Chhichhore' co-stars Sushant and Shraddha Kapoor plan to meet their friends on the special screening of their film". Times of India. Retrieved 1 September 2019.
  14. "Drive to release on November 1 on Netflix". outlookindia.com/.
  15. "Sushant Singh Rajput, Sanjana Sanghi starrer Fault in Our Stars remake titled as Kizie Aur Manny". Bollywood Hungama.
  16. 16.0 16.1 "From Kis Desh Mein Hai Meraa Dil to Jhalak Dikhhla Jaa 4: A look at Sushant Singh Rajput's TV stint". The Indian Express (in ఇంగ్లీష్). 14 June 2020. Retrieved 14 June 2020.
  17. సుశాంత్ ఆత్మాహుతి
  18. సుశాంత్ పోస్టు మార్టం రిపోర్టు
  19. "సుశాంత్ మరణం పై పోలీసుల దర్యాప్తు". Archived from the original on 2020-08-17. Retrieved 2020-09-28.