స్మితా సబర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్


యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం & కల్చర్ కార్యదర్శి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
- 2024 నవంబర్ 11

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జనవరి 4 - 2024 నవంబర్ 10

వ్యక్తిగత వివరాలు

జననం (1977-06-19) 1977 జూన్ 19 (వయసు 47)
జాతీయత  భారతీయురాలు
తల్లిదండ్రులు కల్నల్ ప్రణబ్ దాస్, పురాబి బెనర్జీ
జీవిత భాగస్వామి
అకున్ సబర్వాల్, ఐపీఎస్
(m. 2004)
సంతానం నానక్ సబర్వాల్, భువీస్ సబర్వాల్
వృత్తి ఐఏఎస్‌ అధికారి

మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్.[1] 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.[2]

1977 సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించిన స్మితా సబర్వాల్.. తన గ్రాడ్యుయేషన్‌ విద్యను హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఈమె ఎన్ఎస్ఎస్ వాలంటీర్. బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెటింగ్‌లో డిగ్రీని పొందారు. 2001 ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన స్మితా... 2001లో అదిలాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2003 జూలై 14 నుంచి 2004 నవంబరు 27వ తేదీ వరకు చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2004 నవంబరు 28 తేదీ నుంచి 2004 డిసెంబరు 31వ తేదీ వరకు గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2005 జనవరి ఒకటో తేదీ నుంచి 2006 మే 15వ తేదీ వరకు కడపలో ప్రాజెక్టు డైరక్టర్‌గానూ, 2006 మే 16వ తేదీ నుంచి 2007 మే 29వ తేదీ వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గానూ, 2007 మే 29వ తేదీ నుంచి 2009 అక్టోబరు 22వ తేదీ వరకు విశాఖపట్నంలో వాణిజ్యపన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 2009 అక్టోబరు 22వ తేదీ నంచి 2010 ఏప్రిల్ 9వ తేద వరకు కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో జాయింట్ కలెక్టర్‌గా, 2010లో కరీంనగర్ కలెక్టర్‌గా, మెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అనేక మంచి పనులు చేసి జిల్లా వాసుల నుంచి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. స్మితా సభర్వాల్ తెలుగు, బెంగాల్, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడ గలరు. స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్. ఆయన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహించాడు. ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

స్మితా సబర్వాల్ 2024 జనవరి 4 నుండి[3] 2024 నవంబర్ 11 వరకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా పని చేయగా, ఆమెను 2024 నవంబర్ 11న యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి శాఖ కార్యదర్శిగా నియమితురాలైంది.[4]

వివాదం

[మార్చు]

స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్న అంశంపై ఎక్స్‌లో ఈ విధంగా... ఐఏఎస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్స్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. IAS/IPS/IFoS అనేవాటిలో ఫీల్డ్ వర్క్, పన్నులు వేయడం, ప్రజల బాధలను వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ రిజర్వేషన్ అవసరమా అని తన అభిప్రాయాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేయగా అది వివాదాస్పదమైంది.[5] దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని ఆమెపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కొందరు కేసు వేయగా, విచారణ జరిపిన తరువాత ఈ పిటిషన్ కు విచారణ అర్హతలేదని హైకోర్టు కొట్టివేసింది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes Telugu (17 September 2024). "శక్తివంతమైన ఆయుధంతో ఐఏఎస్‌గా ఎదిగి.. ఆదర్శంగా నిలిచి.. స్మితా సబర్వాల్ సక్సెస్ స్టోరీ". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  2. Sakshi (28 May 2021). "ఐఏఎస్ ఆఫీస‌ర్‌ స్మితా స‌బ‌ర్వాల్ స‌క్సెస్ జ‌ర్నీ...తొలి ప్రయత్నంలోనే." www.sakshieducation.com. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  3. The Hindu (3 January 2024). "Telangana IAS officer Smita Sabharwal transferred out of CMO in a major reshuffle of IAS officers" (in Indian English). Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  4. Andhrajyothy (12 November 2024). "మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు." Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  5. Andhrajyothy (22 July 2024). "చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  6. Andhrajyothy (12 August 2024). "హై కోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  7. TV5 (3 September 2024). "స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)