హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్
వ్యక్తిగత సమాచారం
జననం1948
హరిద్వారమంగళం, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిడోలు వాద్య కళాకారుడు
వాయిద్యాలుడోలు

హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్ తమిళనాడు కు చెందిన డోలు వాద్య కళాకారుడు.[1]

విశేషాలు

[మార్చు]

ఇతడు 1948లో తమిళనాడులోని హరిద్వారమంగళం గ్రామంలో జన్మించాడు. ఇతడు తన తండ్రి ఎస్.కుమారవేల్ పిళ్ళై వద్ద డోలు నేర్చుకున్నాడు. తరువాత 1959 నుండి టి.జి.ముత్తుకుమారస్వామి పిళ్ళై వద్ద డోలు వాయించడంలో సంపూర్ణ శిక్షణ తీసుకున్నాడు. ఇతడు అనేక మంది సంగీత కళాకారుల కచేరీలలో డోలు సహకారం అందించాడు. అనేక సోలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు నాదస్వరంతో పాటు ఇతర సంప్రదాయ వాద్యాలైన వేణువు, క్లారినెట్, మాండొలిన్, శాక్సోఫోన్ మొదలైన వాటి కచేరీలకు కూడా ప్రక్కవాద్యం అందించాడు. భరతనాట్య కళాకారుల ప్రదర్శనలలో కూడా డోలు వాద్య సహకారం అందించాడు. ఇతడు భారతదేశంలోనే కాక అమెరికా, కెనడా, ప్యారిస్, స్విట్జర్లాండ్, పశ్చిమ జర్మనీ, జనీవా, జపాన్ మొదలైన అనేక ప్రదేశాలలో తన కళాప్రదర్శన కావించాడు. ఇతడు తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాల, అమెరికాలోని వెస్లియన్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[2] అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి ఎనిమిది సంవత్సరాలు డీన్‌గా పనిచేశాడు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి డోలు విద్వాంసుడు ఈయన.[3] ఇతడు తిరువయ్యారులోని శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు కార్యదర్శిగా పనిచేశాడు.

పురస్కారాలు, గుర్తింపులు

[మార్చు]
  • 1980లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడికి కళైమామణి పురస్కారం ప్రకటించింది.
  • 1981లో తమిళనాడు ప్రభుత్వం ఆస్థాన విద్వాంసునిగా నియమించింది.
  • 2001లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి అవార్డును ప్రకటించింది.
  • 2004లో భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీతో గౌరవించింది.[4]
  • 2012లో శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారు ఇతనికి "సంగీత చూడామణి" బిరుదును ప్రదానం చేసింది. ఒక డోలు విద్వాంసునికి ఈ బిరుదును ఇవ్వడం ఇదే ప్రథమం.[3]
  • ఇంకా ఇతనికి నవనందీశ్వర నాద పెరోలి, తవిల్ ఇసై తిలకం, తవిల్ చక్రవర్తి వంటి బిరుదులు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. web master. "Haridwaramangalam A. K. Palanivel". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 22 March 2021.[permanent dead link]
  2. ఎడిటర్. "HARIDWARAMANGALAM A. K. PALANIVEL". SRUTI.MAGAZINE. Retrieved 22 March 2021.
  3. 3.0 3.1 V. BALASUBRAMANIAN (12 January 2012). "Master of rhythm". The Hindu. Retrieved 22 March 2021.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.