హైటెక్ సిటీ మెట్రో స్టేషను
హైటెక్ సిటీ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | 7/ఎ/2, హైటెక్ సిటీ రోడ్డు, జైహిద్ ఎన్‌క్లేవ్, సైబర్ టవర్స్ సమీపంలో, హైటెక్ సిటీ, హైదరాబాదు, తెలంగాణ - 500081[1] |
Coordinates | 17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Depth | 7.07 మీటర్లు |
Platform levels | 2 |
History | |
Opened | మార్చి 20, 2019 |
హైటెక్ సిటీ మెట్రో స్టేషను, హైదరాబాదులోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2][3] దీని ఎత్తు 60 అడుగులు (18 మీటర్లు) గా ఉంది.[4] హిటెక్ సిటీ మెట్రో స్టేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాదు నెక్స్ట్ గల్లెరియా మాల్ (పివిఆర్ ఐకాన్ మల్టీప్లెక్స్) సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[5] ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన హైదరాబాదు నెక్స్ట్ గల్లెరియా మాల్[6] రెండు ఎకరాలలో విస్తరించి (సుమారు 2,00,000 చదరపు అడుగులు లేదా 19,000 చదరపు మీటర్లు) ఉంది.[7][8]
హైదరాబాదులో అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో హైటెక్ సిటీ మెట్రో స్టేషను ఒకటి.[9] ఈ స్టేషను నుండి ప్రతిరోజూ సుమారు 42,000మంది ప్రయాణం చేస్తున్నారు.[10][11] నాగోల్ మెట్రో స్టేషను నుండి ప్రారంభమైన ఈ కారిడార్ రహేజా మైండ్స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషను) లోని టెర్మినల్ పాయింట్ వద్ద ముగుస్తుంది.[12][13]
చరిత్ర
[మార్చు]2019, మార్చి 20న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]హైటెక్ సిటీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]
స్టేషన్ లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → నాగోల్ వైపు → | |
ఉత్తర దిశ | → ← హైటెక్ సిటీ వరకు ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 https://www.ltmetro.com/metro_stations/
- ↑ "Hyderabad metro to commission line up to Hitec City by year end".
- ↑ "Hyderabad metro stations we keenly await".
- ↑ "Punjagutta, Hitec Metro stations to stand tall".
- ↑ "'Reverse' metro construction under way at Hi-Tec City".
- ↑ "L&TMRH to open two more malls".
- ↑ "Hyderabad Next Galleria mall in Hitec City operational".
- ↑ "Get ready for a shopping spree: 3 million sft mall space in the offing at Hi-Tec City".
- ↑ "HiTec City metro travellers can expect better frequency".
- ↑ "Techies take to metro and how! Hitec city line registers record footfall".
- ↑ "Another feather in Metro Rail's cap".
- ↑ "Which way will airport metro go?".
- ↑ "Metro rail line to Raidurg another two years away".
ఇతర లంకెలు
[మార్చు]- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.