అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)
అచ్చంపేట | |
---|---|
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 16°23′56″N 78°38′13″E / 16.3990°N 78.6370°E | |
దేశం | భారతదేశం |
State | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ |
Elevation | 78.73 మీ (258.30 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 20,721 |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 509375 |
టెలిఫోన్ కోడ్ | 08541 |
ISO 3166 code | IN-TG |
Vehicle registration | TS |
సమీప విమానాశ్రయం | హైదరాబాద్ |
లోక్‌సభ నియోజకవర్గం | నాగర్‌కర్నూల్ |
శాసనసభ నియోజకవర్గం | అచ్చంపేట |
అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం,[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2013 జూన్ 25న అచ్చంపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఈ పట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా పరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగి ఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి. వైద్య పరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దేవినేని అచ్చమ్మ దొరసాని ఈ పట్టణాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరుమీదుగా ఇది అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారుల భావన. ఐతే18వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అలంపూరు బిజ్జల పాలక వంశానికి చెందని అచ్చమ్మ స్థాపించిందనీ, ఆమె పేరుమీదుగా అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారులు చెప్తారు. దేవినేని అచ్చమ్మ దొరసాని గ్రామాన్ని నెలకొల్పినట్టు పేర్కొనే శాసనం ఒకటి ఉమామహేశ్వరంలో లభిస్తోంది.[4]
పరిపాలన
[మార్చు]గ్రామంలో 1898లో మునసబు ఆఫీసు, 1939లో తహశ్శీలు ఆఫీసు ఏర్పడ్డాయి. దీనితో 1939లోనే తాలూకా కేంద్రమైంది.[4]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.
విద్యాసంస్థలు
[మార్చు]- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
- త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
- ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
- ప్రగతి డిగ్రీ కళాశాల
- తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), ఫోను నెం:08541-272040
పర్యాటక ప్రదేశాలు
[మార్చు]- ఉమామహేశ్వరాలయం. (శ్రీశైలం ఉత్తర ద్వారం)
- మల్లెలతీర్థం: శ్రీశైలం వెళ్ళేదారిలో వటవర్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
- లోద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
- సలేశ్వరం: తెలంగాణా అమరనాథ్‌గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
- ఫరహాబాద్ దృశ్య కేంద్రం: నల్లమల్ల అడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
- మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం
- అక్కమహాదేవి గుహలు
- శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరంగా పేరుగాంచింది.
నీటిపారుదల భూమి
[మార్చు]2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
- ↑ 2.0 2.1 "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "Basic Information of Municipality, Atchampet Municipality". atchampetmunicipality.telangana.gov.in. Retrieved 12 April 2021.
- ↑ 4.0 4.1 లింగమూర్తి, కపిలవాయి (1992). పాలమూరు జిల్లా ఆలయాలు. 17.
- ↑ Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79