అత్తలూరు

వికీపీడియా నుండి
  ?అత్తలూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°32′N 80°15′E / 16.531351, 80.242767
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 8 మీ (26 అడుగులు)
జిల్లా(లు) గుంటూరు
తాలూకాలు అమరావతి
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాస్యత శాతం

• 1.017
• 50.3%
లోక్‌సభ నియోజకవర్గం గుంటూరు
శాసనసభ నియోజకవర్గం పెదకూరపాడు
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 522436
• +08640

అత్తలూరు, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదు.

సివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందు అంతరభాగముగ వున్నది.

పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.

  • తూర్పు బజారు
  • నడిమ బజారు
  • పడమటి బజారు
  • పెద్ద పల్లె
  • చిన్న పల్లె
  • ఎరుకల గుడిసెలు

కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది. అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా కలదు. ప్రస్థుతం ఏర్పాటు చెయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి క్రిష్ణా నది నీటిని సరఫరా చేస్తున్నవి.


"http://te.wikipedia.org/w/index.php?title=అత్తలూరు&oldid=808343" నుండి వెలికితీశారు