అమలాపురం లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేత అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,32,830 [1]
  • ఓటర్ల సంఖ్య:12,38,690
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 23.65% మరియు 0.66%.

నియోజకవర్గపు ప్రత్యేకతలు[మార్చు]

  • దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
  • ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మూడవ 1962-67 బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 కుసుమ కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమదవ 1984-89 ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 కుసుమ కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 గంటి మోహనచంద్ర బాలయోగి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 కె.ఎస్.ఆర్.మూర్తి భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 గంటి మోహనచంద్ర బాలయోగి తెలుగుదేశం పార్టీ
పదమూడవ 1999-04 గంటి మోహనచంద్ర బాలయోగి తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-2009 జి.వి.హర్షకుమార్ భారత జాతీయ కాంగ్రెసు
15వ 2009- జి.వి.హర్షకుమార్ భారత జాతీయ కాంగ్రెసు

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వి.హర్షకుమార్ పోటీ చేస్తున్నాడు. [2]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009