అరసవిల్లి

వికీపీడియా నుండి

దేవాలయం వెబ్‌సైటు నుండి తీసుకొన్న చిత్రం [1]
అరసవిల్లి - శ్రీకాకుళం _ సూర్యనారాయణ స్వామి ఆలయము,చిత్రముల కూర్పు


అరసవిల్లి - శ్రీకాకుళం

పూర్వము శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం మండలంలో ఉన్న గ్రామం. ఇప్పుడు (2008)శ్రీకాకుళం పట్టణానికి కలిపి వేసి మున్సిపాలిటీ లో ఒక వార్డుగా పరిగనించదమైనది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని "హర్షవల్లి" అనేవారని క్రమ క్రమంగా "అరసవిల్లి" అయిందని చెపుతారు.

విషయ సూచిక

[మార్చు] స్థల పురాణం

[మార్చు] దేవాలయ చరిత్ర

అరసవిల్లి ఆలయం పుష్కరిణి

ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ లభించిన శాసనాలు క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినవి. అందువల్ల యిది ప్రాచీన దేవాలయం అని చెప్పవచ్చు. భారతదేశం లోని కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. (ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు). ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిస్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరనో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది.

ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

[మార్చు] ఆలయ విశేషాలు

ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని ఏకామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది.

[మార్చు] అరసవిల్లి - శ్రీకాకుళం _ సూర్యనారాయణ స్వామి ఆలయము,కొన్ని చిత్రములు


[మార్చు] బయటి లింకులు


పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు