కోణార్క్

వికీపీడియా నుండి

కోణార్క్ (Konark) భారతదేశములో పేరెన్నికగన్న సందర్శనా ప్రదేశములలో ఒకటి. ఈ క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి ఎనభై ఐదు (85) కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గాంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది.

విషయ సూచిక

[మార్చు] సూర్యదేవాలయము

కోణార్క్ దేవాలయంలో సూర్య భగవానుని రథచక్రం

కోణార్కలో సముద్రతీరమున నిర్మించిన సూర్య దేవాలయము కలదు. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంటుంది.


ప్రత్యేకతలు

ఈ సూర్యదేవాలయములో ఎన్నో విచిత్రాలు కలవు.

  • ఆలయం రధాకారము కలిగి ఉంటుంది.
  • ఆలయాన పన్నెండు జతల చక్రాలు కలిగి ఉంటుంది.
  • దేవాలయముపైన పద్మము మరియు కలశము ఆకర్షణీయముగా చెక్కబడి ఉన్నాయి.
  • ఖుజరహొ మాదిరి ఇక్కడకూడా శృంగార రసభరిత శిల్పాలు విషేషంగా కలవు.
  • ఇక్కడి సముద్రతీర ఇసుక బంగారపు వర్ణములో ఉండి తీర ప్రాంతము అందాలు చిందుతూ ఉల్లాసం కలిగిస్తుంది.

[మార్చు] ఇతర దేవాలయములు,ప్రదేశాలు

కోణార్కలో శ్రీ పరమేశ్వరస్వామివారి దేవస్థానము కలదు. 1951లో నిర్మించినట్లుగా చెప్పే అరుణ స్థంభము కలదు.

[మార్చు] తీర్దాలు

మంగళాదేవి తీర్ధము. పాల్మిలిబాంగ్ తీర్ధము. చంద్రబాగ్ మరియు చాయాదేవి తీర్ధములు కలవు.

[మార్చు] ఉత్సవాలు

కోణార్కలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమికి {రథసప్తమి} బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి వేలాదిగా తరలి వస్తారు.

[మార్చు] ఇవి కూడా చూడండి

పేజీకి సంభందించిన లింకులు