ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు

వికీపీడియా నుండి

ఖజురహో దేవాలయాల సమూహము*
UNESCO World Heritage Site

A typical temple at Khajuraho with divine couples. Note lace-like ornamentation on the major and the minor shikharas.
State Party Flag of భారత దేశం భారత్
టైపు (ఎలాంటిది) సాంస్కృతిక
Criteria i, iii
రిఫరెన్సు 240
ప్రాంతం ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
Inscription history
వ్యవస్థాపన 1986  (10వ Session)
* Name as inscribed on World Heritage List.
Region as classified by UNESCO.

ఖజురహో (ఆంగ్లం : Khajuraho) (హిందీ : खजुराहो ) మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం.

ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.

ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాషనుండి మూలంగా వచ్చినది. హిందీలో ఖజూర్ అనగా ఖర్జూరము.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశము లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు నూరు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాత కాలంలో చందేల రాజధాని మహోబా కు మార్చబడినది. అయినా మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.

దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కాని ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడినాయి.

ఉత్తర భారతం లో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీ.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు.

ఖజురహో లోని లక్ష్మణ దేవాలయం. Another view

[మార్చు] భౌగోళిక స్థానము

ఖజురహో 24.85° N 79.93° E స్థానము లో ఉన్నది. సరాసరి ఎత్తు 283 మీటర్లు (928 అడుగులు).

[మార్చు] ప్రస్తుత ప్రజానీకము

2001 జనాభా లెక్కల ప్రకారం ఖజురాహో జనాభా 19,232. ఇందులో 52 శాతం పురుషులు, 48 శాతం స్త్రీలు. ఇక్కడ అక్షరాస్యత శాతం జాతీయ సగటు 59.5% కంటే తక్కువ గా 53% ఉన్నది. పురుషుల్లో అక్షరాస్యతా శాతం 62%, స్త్రీలలో అక్షరాస్యతా శాతం 43% ఉన్నది. ఖజురాహో లొ 6 సంవత్సరాల కంటె తక్కువ వయసు గలవారు 19 శాతము ఉన్నారు.

[మార్చు] ఖజురహో లోని శిల్పాలు మరియు శిల్పకళ

కందారియా మహాదేవ దేవాలయం.


[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] ఇతర పఠనాలు

  • Phani Kant Mishra, Khajuraho: With Latest Discoveries, Sundeep Prakashan (2001) ISBN 8175741015

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
పేజీకి సంభందించిన లింకులు