ఆత్మకూరి గోవిందాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మకూరి గోవిందాచార్యులు
ఆత్మకూరి గోవిందాచార్యులు
జననం
ఆత్మకూరి గోవిందాచార్యులు

1895
మరణం1973
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికా సంపాదకుడు, శాసన సభ్యుడు, రచయిత
గుర్తించదగిన సేవలు
గోవింద రామాయణము, సత్యాగ్రాహి (పత్రిక)
తల్లిదండ్రులువేంకట కృష్ణమాచార్యులు, సుభద్ర

ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ బ్రాహ్మణుల కుటుంబంలో, వేంకట కృష్ణమాచార్యులు, సుభద్ర దంపతులకు కుమారునిగా జన్మించారు. ఆయన తెలుగు, ఆంగ్లం, సంస్కృతం అభ్యసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి శిక్షణ కోర్సును చదవడం ప్రారంభించారు.

స్వాతంత్ర సమరంలోకి[మార్చు]

ప్రభుత్వోపాధ్యాయ కోర్సు చదవడం ప్రారంభించిన ఆత్మకూరి గోవిందాచార్యులు 1920 అక్టోబర్ 13న గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని విద్యాభ్యాసం వదలిపెట్టారు. 1920లో కలకత్తా, నాగపూర్ లలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున గాంధీ సహాయ నిరాకరణను సమర్థిస్తూ మాట్లాడారు. 1921లో ఏలూరులో గాంధీ ప్రబోధించిన జాతీయ విద్యాలయం స్థాపించినవారిలో ఆయన ఆత్మకూరి కూడా ఉన్నారు.

పత్రికా సంపాదకునిగా[మార్చు]

వీరు ఏలూరు నుండి 1924లో సత్యాగ్రాహి అనే పేరుతో ఒక రాజకీయ వారపత్రికను స్థాపించి దానికి సంపాదకులుగా ఉన్నారు.[1]

సంఘ సంస్కర్తగా[మార్చు]

అస్పృశ్యులకు ఏలూరులోని జనార్దనస్వామి ఆలయ ప్రవేశానికై అత్తిలి సూర్యనారాయణ, గూడూరు రామచంద్రరావు, చెంచుదాసు, అయ్యదేవర కాళేశ్వరరావు, నరాలసెట్టి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సత్యాగ్రహాన్ని నిర్వహించాడు.[2]

రచనలు[మార్చు]

  • గోవింద రామాయణము[3]
  • మహాత్మా గాంధీ చరిత్ర
  • భారతదేశ ఆర్థికచరిత్ర
  • భారతీయ రాజ్యాంగ చరిత్ర
  • పాహిమాం శతకము

మూలాలు[మార్చు]

  1. కథానిలయం జాలస్థలిలో సత్యాగ్రాహి వివరాలు
  2. జంగం చిన్నయ్య, అనువాదం:కె.సజయ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు (2021 ed.). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 157. Retrieved 4 January 2024.
  3. ఇంటర్నెట్ ఆర్కీవ్స్‌లో పుస్తక ప్రతి