ఆనంద భైరవి (1984 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
(ఆనంద భైరవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆనంద భైరవి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం అశ్విని కార్తిక చిత్ర
కథ కొండముది శ్రీరామచంద్రమూర్తి
చిత్రానువాదం జంధ్యాల
తారాగణం గిరీష్ కర్నాడ్,
మాళవిక సర్కార్,
రాజేష్,
జె.వి.రమణమూర్తి,
కాంచన,
మహాలక్ష్మి,
పుచ్చ పూర్ణచంద్రం,
శ్రీలక్ష్మి,
సుత్తి వీరభద్రరావు,
సుత్తివేలు
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
ఎస్.జానకి,
పి.సుశీల
నృత్యాలు వి.శేషు పారుపల్లి
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,
వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం ఎస్.గోపాలరెడ్డి
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ కళ్యాణి ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆనంద భైరవి 1984 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ చిత్రం హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రూపొందించబడింది. ఈ చిత్రంలో గిరీష్ కర్నాడ్, సుత్తివేలు, మాళవిక, రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించారు. ఇది కొండముది శ్రీరామచంద్రమూర్తి నవల చిరుమువ్వల మరుసవ్వడి ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రానికి గానూ, జంధ్యాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకునిగా బంగారు నందిని అందుకున్నాడు. ఈ చిత్రం 1984 లో ఎన్నో ప్రశంసలు అందుకున్నది.

కథా - కథనం[మార్చు]

ఈ చిత్రము "కూచిపూడి" నృత్యము గూర్చి అవగాహన కల్పిస్తుంది. ఇందులో ఒక అబ్బాయి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటూ దాన్ని ఇబ్బందిగా భావిస్తుంటాడు. మరో వైపు అతని గురువు కూచిపూడి నృత్యాన్ని వారసత్వంగా ముందుకు తీసుకెళ్లడానికి తన శక్తిమేరకు కృషి చేస్తుంటాడు. చాలా రోజులు వెతికిన అనంతరం, ఒక అమ్మాయిని చేరదీసి కూచిపూడి విద్యను నేర్పి ఆయన కోరికను నెరవేర్చుకుంటారు. ఆ కాలములో ఆడవారు నృత్యము చేయరాదు, కనుక అయన కులము నుండి, ప్రార్ధనా మందిరముల నుండి బహిష్కరింపబడుతారు.

పాటలు - గాయకులు[మార్చు]

బహుమతులు, పురస్కారాలు[మార్చు]

జాతీయ పురస్కారలు[మార్చు]

  • ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడు

నంది పురస్కారాలు[మార్చు]

  • ఉత్తమ చిత్రానికి గాను, బంగారు నంది
  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు
  • ఎస్. గోపాల రెడ్డి - ఉత్తమ ఛాయాగ్రహణం
  • కొండముది శ్రీరామచంద్రమూర్తి - ద్వితీయ ఉత్తమ కథా రచయిత

ఆంధ్రప్రదేశ్ చిత్ర విలేకరుల పురస్కారము[మార్చు]

  • ఉత్తమ చిత్రం
  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు
  • గిరీష్ కర్నాడ్ - ఉత్తమ నటుడు

విజయవాడ చిత్ర విలేకరుల పురస్కారము[మార్చు]

  • ఉత్తమ చిత్రం
  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు
  • రమేష్ నాయుడు - ఉత్తమ సంగీత దర్శకుడు

వంశీ పురస్కారములు[మార్చు]

  • ఉత్తమ చిత్రం
  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు
  • రమేష్ నాయుడు - ఉత్తమ సంగీత దర్శకుడు
  • కాంచన - ఉత్తమ నటి
  • సుత్తి వీరభద్ర రావు, సుత్తి వేలు - ఉత్తమ హాస్యనటుల జోడి
  • శ్రీలక్ష్మి - ఉత్తమ హాస్య నటి
  • కొండమూడి శ్రీ రామచంద్ర మూర్తి - ఉత్తమ కథ

కళాసాగర్ పురస్కారములు[మార్చు]

  • ఉత్తమ చిత్రం
  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు
  • రమేష్ నాయుడు - ఉత్తమ సంగీత దర్శకుడు
  • కొండమూడి శ్రీ రామచంద్ర మూర్తి - ఉత్తమ కథ
  • ఉత్తమ హాస్య నటుడు
  • ఉత్తమ హాస్య నటి

ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ పురస్కారములు[మార్చు]

  • ఉత్తమ చిత్రం
  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు
  • రమేష్ నాయుడు - ఉత్తమ సంగీత దర్శకుడు
  • గిరీష్ కర్నాడ్ - ఉత్తమ నటుడు
  • ఉత్తమ నటి
  • ఉత్తమ హాస్య నటి
  • ఉత్తమ బాల నటి

హాస్యప్రియ రేలంగి ఎకాడమి పురస్కారములు[మార్చు]

  • ఉత్తమ హాస్య నటి

మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారము[మార్చు]

  • జంధ్యాల - ఉత్తమ దర్శకుడు

బయటి లింకులు[మార్చు]