ఆశిష్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆశిష్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమ్మన ఆశిష్ రెడ్డి
పుట్టిన తేదీ (1991-02-24) 1991 ఫిబ్రవరి 24 (వయసు 33)
సికింద్రాబాద్, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రఆల్-రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012డెక్కన్ ఛార్జర్స్ (స్క్వాడ్ నం. 14)
2013-2015సన్‌రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 02)
2009–ప్రభుత్వంహైదరాబాదు క్రికెట్ టీం
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్ట్-ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 22 38 77
చేసిన పరుగులు 987 745 637
బ్యాటింగు సగటు 37.96 29.80 13.55
100s/50s 1/9 1/4 0/0
అత్యధిక స్కోరు 104 119 (నాటౌట్) 37
వేసిన బంతులు 2,916 1,424 940
వికెట్లు 53 46 57
బౌలింగు సగటు 27.00 30.06 22.01
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/56 5/30 4/22
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 6/– 22/–
మూలం: Cricinfo, 2019 జూలై 3

అమ్మన ఆశిష్ రెడ్డి, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. రైట్-ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ చేసే రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. హైదరాబాద్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ, ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. రవికిరణ్‌తో కలిసి లిస్ట్ ఎ చరిత్రలోనే అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యం (128)కు నెలకొల్పాడు.[1][2]

జననం[మార్చు]

ఆశిష్ రెడ్డి 1991, ఫిబ్రవరి 24న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని సికింద్రాబాద్‌లో జన్మించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]

ఆశిష్ 2012లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు.[3]

2013[మార్చు]

2013 సీజన్‌లో, ఆశిష్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసింది. కొన్ని మ్యాచ్‌లు ఆడిన ఆశిష్ గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లు ఆడలేదు.

2014[మార్చు]

2014లో ఆశిష్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.

2015[మార్చు]

2015లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ఆశిష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసుకుంది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డారెన్ సామీ వికెట్‌ను తీశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కూడా ఆడాడు. దీనిలో ఏంజెలో మాథ్యూస్‌ బోలింగ్ లో 8 బంతుల్లో 15 పరుగులు చేసి సిక్స్‌ కొట్టాడు, ఆ మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఆశిష్ 8 బంతుల్లో కీలకమైన 22 పరుగులు చేశాడు, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది.

మూలాలు[మార్చు]

  1. "South Zone: Hyderabad (India) v Kerala at Secunderabad, Nov 10, 2014 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-04.
  2. "Records | List A matches | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-04.
  3. "Player profile: Ashish Reddy". ESPNcricinfo. Retrieved మే 7 2012. {{cite web}}: Check date values in: |access-date= (help)

బయటి లింకులు[మార్చు]