ఇటుక
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఇటుక (Brick) కట్టడాల నిర్మాణానికి ఉపయోగించు ఒక ముఖ్యమైన పదార్ధము. వీటిని ఒక వరుసలో పేర్చుకొనుచూ మద్య నీటితో కలపబడిన సిమెంటును వేసి పూడ్చడం ద్వారా ఇంటికి కావలసిన గోడల నిర్మాణము చేస్తారు.
విషయ సూచిక |
[మార్చు] ఇటుకలు - రకాలు
ఇటుకలలో పలు రకాలు కలవు.
- మట్టి ఇటుక
- కాల్చిన మట్టి ఇటుక
- తేలికయిన ఇటుక
- సిమెంట్ ఇటుక
- ప్లాస్టర్ ఆప్ పారిస్ అను జింక్ పదార్ధపు ఇటుక
ఇలా పలు రకాలు కలవు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధమైన ఇటుకలు వాడుతుంటారు
[మార్చు] ఇటుకల తయారీ
[మార్చు] పచ్చిఇటుకలు
సాదారణంగా పూర్వము ఇటుకలు ఎక్కువగా మట్టితో చేసి వాటినే గృహనిర్మాణాలకు వాడుతుండేవారు. వీటిని పచ్చి ఇటుకలు అనేవారు. వీటి తయారీకి నాలుగు పలకలుగా చెక్కతో చేయబడిన అచ్చులలో మట్టిని నింపి, దానిని ఎండలో శుభ్రపరచబడిన నేలపై బోర్లించేవారు. అలా బోర్లించిన మట్టిముద్ద ఆదే ఆకారంలో గట్టి పడి పోతుంది. తరువాత అవే ఇటుకలను కాల్చడం ద్వారా మరింత గట్టిదనం వస్తుందని తెలిసింది. అప్పటి నుండి ఇటుకలను కాల్చి వాడటం మొదలెట్టారు.
[మార్చు] ఇటుక బట్టీలు
కొన్ని వేల ఇటుకలను ఒక చోట పెద్ద గుట్టగా, లేదా పిరమిడ్ లా మధ్య కాళీలను వదులుతూ పేర్చి వాటి మద్య వూక లేదా ధాన్యం పొల్లు మరియు నేలబొగ్గు పోసి వాటిని కాల్చేవారు. ఈ గుట్టలను ఇటుక బట్టీలు అంటారు.
ఇప్పటి కొత్త కాంక్రీటు నిర్మాణాల కొరకు సిమెంటు ఇటుకలను తయారు చేస్తున్నారు. బ్రిక్స్ అని పిలువబడే వీటి నిర్మాణము కొరకు జల్లించిన ఇసుక, చిన్న కంకర లాంటి వాడటం ద్వారా ఖర్చు తగ్గిస్తున్నారు.