ఐ.ఎస్‌.జగన్నాధపురం

వికీపీడియా నుండి

ఐ.ఎస్‌.జగన్నాథపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన గ్రామము .

కొండపైని నరసింహ స్వామి ఆలయం
కొండపైనుండి చుట్టు ప్రక్కల పొలాలు దృశ్యం
కొండకు వెళ్ళే దారి
గ్రామంలో ఒక వీధి.

ఇక్కడ మెరకతోటల వ్యవసాయం జరుగుతుంది. ఈ ఊరికి, ప్రక్క ఊరు ఐ.ఎస్‌.రాఘవాపురంకు మధ్య "నృసింహగిరి" అనే కొండమీద నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి భూతనరసింహ స్వామి. నరసింహుని సరసన కనకవల్లి (మహాలక్ష్మి) అమ్మవారు ఉన్నారు. ఆలయం ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి, ప్రక్కన ఏకాక్షర గణపతి, వెనుక సర్ప శ్రీనివాసు లు దేవతలను ప్రతిష్టించారు.


కొండపైకి కచ్చా రోడ్డు ఉన్నది. 2008 జనవరి నాటికి దీనిని మరింతగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కొండ పైకి వాహనాలు నేరుగా పోవచ్చును. దగ్గరలో పెద్దగా సదుపాయములు లేవు. కనుక భక్తులు తమకు కావలసిన సంబారాలను తమతో తెచ్చుకోవడం మంచిది. ఆలయంలో స్వామిని దర్శించుకొంటే సకల శుభాలు కలుగుతాయని, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. పెళ్ళికావలసిన ఆడపిల్లలకోసము, పిల్లలు లేని దంపతుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ప్రతి ఏకాదశి నాడు భక్తులకు అన్న సంతర్పణ జరుగుతున్నది.

ఈ ఆలయం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి అజమాయిషీలో నిర్వహింపబడే ఒక ఆలయం.

[మార్చు] వనరులు

  • భండారు పర్వతాలరావు రచించిన "ఓం నమో శ్రీ నారసింహాయ" - (ప్రచురణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)


పేజీకి సంభందించిన లింకులు