కస్తూరి పట్నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కస్తూరి పట్నాయిక్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంకస్తూరి బదు
జననం (1966-10-31) 1966 అక్టోబరు 31 (వయసు 57)
కటక్,భారతదేశం
మూలంభారతదేశం
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ నృత్యం
వృత్తిభారతీయ శాస్త్రీయ నృత్యం (ఒడిస్సీ నృత్య కళాకారిణి), నృత్యదర్శకురాలు, ఉపాధ్యాయిని.
క్రియాశీల కాలం1975–ప్రస్తుతం
వెబ్‌సైటుwww.kasturipattanaik.in

కస్తూరి పట్నాయక్, ప్రముఖ ఒడిస్సీ నాట్య కళాకారిణి. ఆమె భువనేశ్వర్ కు చెందిన ఒడిస్సీ రీసెర్చి సెంటర్ లో గురువుగా పని చేస్తోంది కస్తూరి. ఈ సెంటర్ లో 20 ఏళ్ళ నుంచీ ఆమె విద్యార్ధులకు ఒడిస్సీ  నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాక, నృత్య దర్శకత్వం కూడా చేస్తోంది. ఈ రీసెర్చీ సెంటర్ నుంచీ శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ విద్యార్ధిని ఆమె.

జీవిత విశేషాలు[మార్చు]

కస్తూరీ ఒడిస్సీ నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు, గురువు.[1]  ఒడిస్సీ నృత్య రీతిలో ఎక్కువ ఏళ్ళు కెరీర్ ఉన్న కళాకారిణిగా ఈమె  దేశంలో ప్రఖ్యాతి చెందింది.[2] ఎక్కువగా ఒడిస్సీ నృత్య నాటకాలను  సింగిల్ గానూ, గ్రూప్ తోనూ ప్రదర్శిస్తూంటుంది కస్తూరి. సంప్రదాయ, జానపద  రీతుల్ని మేళవించి  ఈ నృత్య నాటకాలను  తీర్చిదిద్దుతుంది ఆమె. ఎక్కువగా భారతీయ పురాణాలు, చారిత్రక ఘటనలు, సామాజిక సమస్యలపై ఈ నాటకలు ఉంటాయి.

ఆమె తన చిన్నతనం నుంచే ఒడిస్సీకథక్ నృత్య రీతుల్ని నేర్చుకుంది. భువనేశ్వర్ లోని ఒడిస్సీ రీసెర్చి సెంటర్ లోనే ఆమె నాట్యం నేర్చుకుంది.[3] ఒడిస్సీ గురువుల్లో ప్రముఖులైన గురు రఘునాథ్ దత్తా, పద్మవిభూషణ్ గ్రహీత గురు కెలుచేరన్ మోహపత్ర, పద్మశ్రీ గ్రహీత కుంకుం మొహంతీ,  పద్మశ్రీ గ్రహీత  గంగాధర్  ప్రధాన్,  గురు రమణి రంజన్ జేన, గురు దయానిధి దాస్ వంటి వారి దగ్గర నేర్చుకుంది కస్తూరి.

ఆసియా ఖండం మొత్తం తిరిగి ప్రదర్శనలు ఇచ్చింది ఆమె. హాంగ్ కాంగ్రష్యాఇండోనేషియా, థాయ్ ల్యాండ్, సింగపూర్ఉత్తర కొరియా వంటి దేశాల్లో  ప్రదర్శనలు ఇవ్వడమే  కాక, అక్కడి వారికి ఒడిస్సీలో  శిక్షణ కూడా ఇచ్చింది కస్తూరి.

ఆమె మన దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతోమంది శిష్యులకు ఒడిస్సీ నేర్పించింది. వారిలో చాలామంది గురువులు అయ్యారు కూడా.

గౌరవాలు[మార్చు]

  • "రాజేంద్రప్రసాద్ స్మృతి సంసద్" కటక్, ఒడిశా నుండి రాజేంద్రప్రసాద్ పురస్కారం - 1997
  • ఒడిస్సీ నాట్య కళలో అధ్బుత ప్రదర్శనకు గానూ విష్ణుప్రియ స్మృతి సమ్మాన్, పూరి వారి నుండి అభినందనిక - 1999.
  • 1987 నుండి రాష్ట్ర ఉపకార వేతనం, 2000లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖచే ఉపకార వేతనం.
  • 2003 లో ఉదయన్ సాంస్కృతిక్ అనుష్టాన్ నుండి "దెడదాసి సమ్మాన్"
  • 2002లో జూరీస్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పిలిం సర్టిపికేటు.
  • 1999 లో కూఛిపూడి నాట్యమండలి, కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ వారిచే గౌరవ పురస్కారం.
  • 2015 లో మహరి పురస్కారం,[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Pattanaik, Kasturi. "Brief Profile of Kasturi Pattanaik". Archived from the original on 2013-08-26. Retrieved 2017-04-27.
  2. Panda, N. Capital sways to Odissi creations. Archived 2018-05-05 at the Wayback Machine
  3. Odissi Research Centre. "Our Shining Stars". Archived from the original on 2021-05-08. Retrieved 2017-04-27.
  4. http://mail.dailypioneer.com/state-editions/bhubaneswar/kasturi-patnaik-gets-mahari-award.html[permanent dead link]