కుకుర్బిటేసి
వికీపీడియా నుండి
| కుకుర్బిటేసి | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Hodgsonia male plant
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
కుకుర్బిటేసి (ఆంగ్లం: Cucurbitaceae) కుటుంబంలో దాదాపు 110 ప్రజాతులు, 840 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి.
[మార్చు] కుటుంబ లక్షణాలు
- నులితీగెలతో ఎగబ్రాకే మొక్కలు.
- లఘు పత్రాలు, హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనము.
- పత్రగ్రీవంలో ఏర్పడే ఏకలింగపుష్పాలు.
- అండకోశోపరిక, సౌష్టవయుత, పంచభాగయుత పుష్పాలు.
- ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తము.
- కేసరాలు 5, సంయోజకము, పరాగకోశాలు మెలితిరిగి 'S' ఆకారంలో ఉంటాయి.
- అండాశయము నిమ్నము, త్రిఫలదళయుతము, కుడ్య అండాన్యాసము.
- పెపో ఫలము.
[మార్చు] ముఖ్యమైన మొక్కలు
- కుకుమిస్ సటైవస్ : (దోసకాయలు)
- కుకుర్బిట మాక్సిమా : (తియ్య గుమ్మడి, కరుబూజా)
- కాక్సినియా కార్డిఫోలియా : (దొండ)
- మొమోర్డికా కరన్షియా : (కాకర)
- మొమోర్డికా డయాకా : (ఆగాకర)
- ట్రైకోసాంథిస్ అంగ్విన : (పొట్ల)
- లాజినేరియా వల్గారిస్ : (సొర)
- లుఫ ఎక్యుటాంగులా : (బీర)
- లుఫ పెంటాండ్రా : నేతిబీర
- సిట్రుల్లస్ వల్గారిస్ : (పుచ్చ)
[మార్చు] మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.