కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


లూరాసియా-గోండ్వానా

భూగోళం కాలక్రమేణ అనేక మార్పులు చెందింది ప్రస్తుతం కనపడె ఖండాలు కాలక్రమేణ ఎన్నొ మార్పులు చెంది, ఈ రుపానికి వచ్చేయి. వివిధ ఖందాలలో, భరత ఖండం ది, చాల క్రియాశీలక పాత్ర. ప్రస్తుతం గోదావరి కృష్ణ నదులు ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని ఇరవైఐదు కోట్ల యాభై లక్షల సంవత్సరాలతం నుంచి భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతున్నారు. 25.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ లో భాగంగా ఉన్న కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ (కే.జి.బేసిన్) గొండ్వానాలో భాగంగా దక్షిణ ధృవానికి సమీపంలో ఉండేది. అంటార్కిటికా కృష్ణ, గోదావరి ప్రాంతానికి సమీపంగా ఉండేది. దాదాపు భారత ఖండం మడగాస్కర్, ఆఫ్రికాలను అంటిపెట్టుకుని ఉండేది. ఈ భాగాన్ని హిమనదం (Glacier) కప్పి ఉంచేది. ప్రస్తుత విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాలు అంటార్కిటికా చేరువలో ఉండేవి


23.7 కోట్ల సంవత్సరాల క్రితం కే.జి.బేసిన్ ప్రాంతంలో వేడెక్కడం ప్రారంభమయ్యింది అంటార్కిటికా సహితంగా అంతటా ఉష్ణమండలం నెలకొని ఉండేది. అది భూమి చరిత్రలోకేల్లా అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు గల సమయం.

19.5 కోట్ల సంవత్సరాల క్రితం దక్షిణ అంటార్కిటికా మొత్తం తూర్పు కోస్తాను కేజి బేసిన్ సహితంగా అంటిపెట్టుకుని ఉండేది. ప్రాణహిత, గోదావరి కోటా డైనోసార్లు, మొసళ్ళు, క్షీరదాలు, చేపలు ఈ ప్రదేశంలో జీవించేవి.

25.5 కోట్ల సంవత్సరాల నుంచి 14 కోట్ల సంవత్సరాల క్రితం వరకు గోదావరి నది వాయువ్య దిశగా ప్రవహించేది. సుమారు 13 నుంచి 14 కోట్ల సంవత్సరాల క్రితం సమయంలో ప్రవాహం తిరుగబడి ప్రస్తుత గోదావరి నదిలానే తూర్పు వైపుగా ప్రవహించడం ప్రారంభించింది. 13 కోట్ల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం, అంటార్కిటికా-భరత ఖండాల నడుమ ఏర్పడింది

భూగర్భ శాస్త్రంలో భూమి మీద మానవుదు వచ్చి అతి కొద్ది, 20 లక్షల సంవత్సరాలు, మాత్రమే.

మూలాలు

[మార్చు]
  • Nemcok, M.; Rybar, S.; Sinha, S. T.; Hermeston, S. A.; Ledvenyiova, L. (2016-09-26). Transform Margins:: Development, Controls and Petroleum Systems. Geological Society of London. ISBN 9781862397446.
  • "Figure 3. Map showing locations of the Krishna-Godavari (KG) Basin in..." ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2018-06-20.