కొఱ్ఱలు

వికీపీడియా నుండి
కొఱ్ఱలు
Immature seedhead
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Poales
Family: పోయేసి
Subfamily: Panicoideae
Genus: Setaria
Species: S. italica
Binomial name
Setaria italica
(లి.) P. Beauvois
Synonyms

Panicum italicum L.
Chaetochloa italica (L.) Scribn.

కొఱ్ఱలు (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.

ప్రాథమిక లక్షణాలు [మార్చు]

కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి.


ఉపయోగాలు [మార్చు]

  • కొర్ర బియ్యంలో పరమాన్నం చేసుకొని తింటారు.
  • కొర్రలతో కూడా గంజి చేసుకొని తాగుతారు.
  • కొర్ర అన్నము మధు మేహ వ్వాది గ్రస్తులకు చాల మంచిది.
"http://te.wikipedia.org/w/index.php?title=కొఱ్ఱలు&oldid=829970" నుండి వెలికితీశారు