గాలి ఎసిటిలిన్ వెల్డింగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాలి అసిటిలిన్ వెల్డింగు[మార్చు]

నిర్వచనం "గాలి అసిటిలిన్ వెల్డింగు అను ప్రక్రియ ఒక గ్యాసు వెల్డింగ్ ప్రక్రియ.ఇది కూడా మిగతా వాయు వెల్డింగుల వంటిదే.లోహములను అతుకునటువంటి ప్రక్రియ.సాధారణంగా వాయు వెల్డింగులలోఇంధన లేదా దహన వాయువు లను(అసిటిలిన్,సహజ వాయువు,ప్రొపెన్,బ్యుటెన్ వంటి ఇంధన వాయువులు) నేరుగా దహనదోహదకారి అయున ప్రాణవాయువు తో దహన పరచి లేదా మండించి తత్ఫలితంగా జనించిన ఉష్ణ శక్తి ని ఉపయోగించి అతుక వలసిన లోహము ల అంచులను కరగించి,రెండు లోహ అంచుల సమ్మేళన పరిచెదరు.గాలి అసిటిలిన్ గ్యాసు వెల్డింగు ప్రక్రియలో అసిటిలిన్, గాలి మిశ్రమాన్ని మండించి,వెలువడిన ఉష్ణశక్తి తో లొహములను కరగించి అతుకుదురు.[1]

గాలి, అసిటిలిన్ వాయువుల లక్షణాలు[మార్చు]

అసిటిలిన్ వాయువు[మార్చు]

అసిటిలిన్ వాయువు ఫార్ములా

అసిటిలిన్ వాయువు కార్బను, హైడ్రోజన్ పరమాణు సమ్మేళనం వలన ఏర్పడిన ఒక వాయువు.కర్బన రసాయనశాస్త్రంలో అల్కిన్(alkyne)వర్గానికిచెందినది.అసిటిన్ వర్ణరహితమైన, వెల్లుల్లి వంటి ఘటైన వాసనను వెలువరించు వాయువు.ఈ వాయువు అత్యంత దహనశీలి.అక్సిజను సమక్షంలో అతిత్రీవ్రంగా,వేగంగా మండుతుంది.దీని రసాయనఫార్ములా C2H2.కార్బను-కార్బను మధ్య త్రిబంధం వున్నది.అందువలన అసిటిలిన్ వాయువు మండినప్పుడు అత్యధికంగా ఉష్ణోగ్రత వెలువడుతుంది.3000-3200C వరకు ఉష్ణోగ్రత వెలువరిస్తుంది.

అసిటిలిన్ వాయు లక్షణాల పట్టిక

లక్షణం విలువల మితి
విశిష్ట గురుత్వం (గాలి=1)15.60Cవద్ద 0.906
అవిరి వత్తిడి,200Cవద్ద 4378 కిలో ఫాస్కల్స్
మరుగు ఉష్ణోగ్రత మైనస్ (ఋణ)840C
జ్వాల ఉష్ణోగ్రత 30870C

గాలి[మార్చు]

గాలి అనునది వాతావరణంలో వున్న కొన్ని వాయువుల మిశ్రమం.గాలిలో 78%నైట్రోజన్,21% వరకు ప్రాణవాయువు/ఆక్సిజన్, మిగిలిన నీటి ఆవిరి, బొగ్గుపులుసు వాయువు, ఆర్గాను తదితరాలు.[2]

గాలియొక్క ధర్మాలు 150Cవద్ద

లక్షణం విలువల మితి
సాంద్రత 1.229 కిలోలు/ఘనమీటరు
విశిష్ట ఘనపరిమాణం 0.814 ఘన మీటర్లు/కిలో
వత్తిడి 1.013 కిలో/చదరపు మీటరు
స్థిగ్నత 1.73−5N-N/m2

వెల్డింగుటార్చు-వెల్డింగు విధానం[మార్చు]

గాలి అసిటిలిన్ వెల్డింగులో జ్వాలను సృష్టించే వెల్డింగు టార్చు లేదా అతుకు కారు మిగతా గ్యాసు వెల్డింగు విధానాలలో వాడే దాన్నికన్న భిన్నమైన పద్ధతిలో పనిచేస్తుంది.అందువలన ఈ టార్చు నిర్మాణం కూడా ఇతర గ్యాసు వెల్డింగు టార్చుల కన్న భిన్నంగా వుంటుంది.ఇతర గ్యాసు వెల్డింగు పద్ధతులైన ఆక్సి అసిటిలిన్, ఆక్సి హైడ్రోజన్, అక్సిజను సహజవాయువు, అక్సి ప్రొపెన్ వంటి వాటిలో ఇంధన వాయువు, ఆక్సిజను వాయువు రెండింటిని వత్తిడి కలిగి సిలెండరులలో నింపిన వాటిని ఉపయోగిస్తారు. అసిటిలిన్ వాయువైనచో కొన్ని సందర్భాలలో వాయుజనకం ద్వారా ఉత్పత్తిచేసి నేరుగా వాడినప్పటికి, అది కుడా కొంత వత్తిడిని కలిగి వుండును.కాని గాలి అసిటిలిన్ వెల్డింగు ప్రక్రియలో గాలిని ప్రత్యేకంగా సిలిండెరులలో నింపి ఉపయోగించడం వుండదు.వాతావరణంలోని గాలిని నేరుగా ధహనక్రియలో వాడీ జ్వాలను సృష్టించెదరు.గాలి అసిటిలిన్ వెల్డింగు టార్చు విద్యాలయాల్లో వాడే బున్సెన్ బర్నరు పనిచేసె సూత్రం ఆధారంగా నిర్మించబడింది.ఇళ్ళలో వంటకై వాడె స్టవ్ బర్నరు కూడా బున్సెన్ బర్నరు మండే పద్ధతిలో మండుతుంది. ఇంధనవాయువు కవాటం మూతి రంధ్రంఉకు బయట బర్నరు యొక్క గొట్టం వుండి, అంచు చుట్టూ రంధ్రాలుండును.ఇంధన కవాటం మూతి రంధ్రం మొదట వెడల్పుగా వుండి, మూతి చివర సన్నంగా వుండును. ఇంధన వాయువు ఈ మార్గంగుండా ప్రయాణించి కవాటం బయటకు వచినప్పుడు, రంధ్రం వ్యాసపరిమాణం క్రమంగా తగ్గటం వలన ఇంధనవాయువు వత్తిడితగ్గి, దాని త్వరణం పెరుగును.ఎక్కువ త్వరణంతో ప్రయాణిస్తున్న వాయు వత్తిడి, పరిసరాలలోని వాతావరణ వత్తిడి కన్న తక్కువగా వుండటం వలన, గాలివచ్చి ఇంధనగాలివైపు త్రోయబడుతుంది.ఈ విధంగా బర్నరు గొట్టంలోలో గాలి, ఇంధనమిశ్రమం ఏర్పడి, బర్నరు అంచువద్ద చిన్న నిప్పు రవ్వను పుట్టించినప్పుడు మంట ఏర్పడుతుంది.గాలి అసిటిలిన్ టార్చు కూడా ఈ సూత్రం ప్రకారమే పనిచేయునట్లు నిర్మించబడినది[3]

వెల్డింగు చేయుటకు అనుకూలమైనవి[మార్చు]

గాలి అసిటిలిన్ వాయువులను మండింఛటం వలన ఏర్పడు జ్వాల యొక్క తీవ్రత మిగతా గ్యాసు వెల్డింగు పద్ధతులకన్న తక్కువ వుండుటం చేత తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత కలిగిన కొన్ని రకాల లోహం లను అతికెదరు

  • మృదువైన రాగి గొట్టాలను అతుక వచ్చును.
  • శీతలీకరణ (Refrigeration), గాలి ఉష్ణనియంత్రణ (Air conditioning) యంత్రాల భాగాలను అతికెదరు.
  • సీసము (మూలకము)కు చెందిన అతికే పనులు.

భద్రత[మార్చు]

దహన వాయువుగా అసిటిలిన్ ను ఉపయోగిస్తున్నందున్న మిగతా గ్యాసు వెల్డింగులలో తీసుకొన్నట్లే అన్ని రకాలైన రక్షణ చర్యలు తీసుకోవాలి.[4]

  • ఎసిటిలిన్ సిలెండరును ఎప్పుడు నిలువుగా వుంచాలి.
  • వేడిగా వున్న వస్తువులకు దగ్గరగా సిలెండరును వుంచరాదు.
  • సిలెండరుకు అమర్చిన రెగ్యులెటరు పనిచేసె స్థితిలో వుండాలి, రెగ్యులెటరుకు బిగించిన పీడన/వత్తిడిమాపకకాలు సరిగా పనిచేసెలా వుండాలి.
  • సిలెండరు కవాటాన్ని దానికి కై నిర్దేశించిన పనిముట్టు (రెంచ్) తోనే తెరవడం, మూయడం చెయ్యాలి.
  • అసిటిల్ సిలెండరు మీద ఎటువంటి నూనె, గ్రీజు మరకలు ఉండరాదు.
  • లోహవస్తువులతో బలంగా అసిటిలిన్ సిలెండరుపై కొట్టరాదు.
  • సిలెండరును నేలమీద దొర్లించడం కాని ఈడ్చడం కాని చెయ్యరాదు.
  • సిలెండరు మీద బరువైన వస్తువులను వుంచరాదు.
  • వెల్డింగు చెయ్యని సమయంలో అసిటిలిన్ సిలెండరు కవాటాన్ని మూసి వుంచాలి.
  • వెల్డింగు చెయ్యునప్పుడు వెల్డింగు చెయ్యు నిపుణుడు రక్షణకు చెందిన దుస్తులు, ఉపకరాణాలు తప్పక ధరించాలి.
  • వెల్డింగు చెయ్యు ప్రాంతంలో నిప్పునార్పు పరికరాలు, పనిచేసె స్థితిలో వున్నవాటిని సిద్ధంగా వుంచాలి, వాటిని ఉపయోగించె విధానం తెలిసివుండాలి.

ఇవికూడా చూడండి[మార్చు]

  1. వెల్డింగ్

బయటి లింకులు[మార్చు]

  1. [1][permanent dead link] గాలిఅసిటిలిన్ వెల్డింగు

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "air-acetylene welding". answers.com. Retrieved 2014-03-05.
  2. "Air Properties Definitions". grc.nasa.gov. Archived from the original on 2019-09-07. Retrieved 2014-03-05.
  3. "Air Acetylene Torch". ebay.com. Retrieved 2014-03-05.
  4. welding technology,By O.P.khanna