గోళీయ విపధనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ద్వారం పెద్దదిగా వున్న పుటాకార దర్పణం మీద అక్షానికి సమాంతరంగా పడుతుంది కాంతి కిరణాలన్నీ పరావర్తనం చెందిన తర్వాత ప్రధానాక్షం మీద వున్న ఒకే బిందువు ద్వారా పోవు.ఆక్షానికి దగ్గరగా ఉన్న కిరణాలు మాత్రమేపరావర్తనం చెందిన తర్వాత ప్రధాన నాభి Fద్వారా పొతాయి. దర్పణం అంచుల దగ్గర పతనమయ్యే కిరణాలు ఉపాక్షీయ కిరణాల కన్నా దగ్గరలో ఆక్షాన్ని తాకుతాయి.దీని వలన అస్పష్ట ప్రతిబింబం ఏర్పడుతుంది.ఈ దోషాన్ని గోళీయ విపధనం అంటారు.[1]

వివరణ[మార్చు]

గోళీయ విపధనాన్ని తగ్గించడానికి దర్పణం ముందు నిరోధక డయాఫ్రం లేదా 'స్టాప్' ని ఉపయోగిస్తారు.గోళీయ విపధనం లేకుండా చేయడానికి పరవలయ దర్పణాలను ఉపయోగిస్తారు. అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నీ పరావర్తనం చెంది నాభి వద్దకు చేరుతాయి. విపర్యంగా నాభి నుంచి బయలుదేరే కిరణాలు పరవలయ దర్పణం మీద పడి పరావర్తనం చెంది సమాంతర కిరణాలవుతాయి. అందువలన పరవలయ దర్పణాలను కారు హెడ్ లైట్లు,సెర్చి లైట్ల లో పరవర్తకాలుగా ఉపయోగిస్తారు.పరావర్తన దూరదర్శినిలలో ఉపయోగించేది పరవలయ దర్పణమే.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం- భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకం

బయట లంకెలు[మార్చు]