జనువాడ రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనువాడ రామస్వామి
జనువాడ రామస్వామి
జననం1952, జనవరి 15
వృత్తికవులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు ప్రొఫెసర్, కవులు
భాగస్వామిసత్యవతి
తల్లిదండ్రులు
  • ఆగమయ్య (తండ్రి)
  • పార్వతమ్మ (తల్లి)

జనువాడ రామస్వామి, తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.

జనువాడ రామస్వామి హైదరాబాద్ వెస్ట్ జోన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో తీసిన ఫోటో

జననం[మార్చు]

రామస్వామి 1952, జనవరి 15న ఆగమయ్య - పార్వతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించాడు.

చదువు - ఉద్యోగం[మార్చు]

తెలుగులో ఎం.ఏ, పి.హెచ్‌.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ గా పదవి విరమణ పొందారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రామప్వామికి సత్యవతితో వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు (రాఘవేంద్ర)

ప్రచురిత పుస్తకాలు[మార్చు]

  1. కవితారామం (కవితా సంకలనం, 1986)
  2. మనోనేత్రం (కవితా సంకలనం, 1996)
  3. శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం (2002)[1]
  4. జనువాడ కవితలు (2003)
  5. శ్రీ తిరుమలేశ శతకం (2010)
  6. శ్రీ వేంకటాచల నివాస శతకము (2018)[2]
  7. రాజదండం (పద్యకృతి)[3]

మూలాలు[మార్చు]

  1. జనువాడ రామస్వామి (2002). శ్రీ చిలుకూరు వేంకటేశ్వర శతకం.
  2. "ఆత్మ సమర్పణకు అద్దం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.
  3. "పార్టీలకు చురక, ప్రజలకు వైతాళిక గీతిక | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.

బయటి లింకులు[మార్చు]

  1. యూ.ఎల్.ఐ లో జనువాడ కవితలు పుస్తకం[permanent dead link]
  2. శ్రీ తిరుమలేశ శతకం గురించి ఆర్. సుశీల గారు ఆంధ్రభూమిలో రాసిన వ్యాసం[permanent dead link]