వికీపీడియా నుండి
జాన్ బోర్గ్ (Björn Rune Borg) 1956, జూన్ 6న స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతడు స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమమైన ఆటగాళ్ళలో జాన్ బోర్గ్ ఒకడు. [1][2][3].
9 సంవత్సరాల పాటు 27 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్ళ కోసం పోటీపడి 41% విజయ శాతంతో 11 టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. మొత్తం 141 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో 89.8% విజయ శాతంతో 141 మ్యాచ్‌లు గెలుపొందినాడు. బోర్గ్ ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య కేవలం 16 మాత్రమే. అందులో 5 సార్లు ఫైనల్ దశకు చేరుకొని ఫైనల్లో అమెరికాకు చెందిన జిమ్మీ కానర్(2), జాన్ మెకెన్రో (3) ల చేతిలో పరాజయం పొందినాడు.
[మార్చు] జాన్ బోర్గ్ సాధించిన గ్రాండ్‌స్లామ్ విజయాలు (11)
జాన్ బోర్గ్ మొత్తం 16 సార్లు గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ పైనల్‌లోకి ప్రవేశించి 11 టైటిళ్ళను గెలిచి ఆరింటిలో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పైనల్‌లో ఓడిన ప్రతీసారి జిమ్మీకానర్ లేదా జాన్ మెకెన్రో చేతిలోనే ఓడిపోవుట విశేషం. జాన్ బోర్గ్ ప్రెంచ్ ఓపెన్‌ను 6 సార్లు గెలవగా, వింబుల్డన్‌ను 5 సార్లు సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో 4 సార్లు పైనల్‌లోకి వచ్చిననూ జిమ్మీ కానర్స్ మరియు జాన్ మెకెన్రో్‌ల వల్ల ఆ టైటిల్ అతడికి కలగానే మిగిలిపోయింది.
| సంవత్సరం |
చాంపియన్‌షిప్ |
పైనల్‌లో ప్రత్యర్థి |
పైనల్‌లో స్కోరు |
| 1974 |
ప్రెంచ్ ఓపెన్ |
మాన్యువెల్ ఒరాంటిస్ |
2-6, 6-7, 6-0, 6-1, 6-1 |
| 1975 |
ప్రెంచ్ ఓపెన్(2) |
మూస:Country data ARG గిలెర్మో విలాస్ |
6-2, 6-3, 6-4 |
| 1976 |
వింబుల్డన్ ఓపెన్ |
మూస:Country data ROM ఇలీ నస్టాజ్ |
6-4, 6-2, 9-7 |
| 1977 |
వింబుల్డన్ ఓపెన్ (2) |
జిమ్మీ కానర్స్ |
3-6, 6-2, 6-1, 5-7, 6-4 |
| 1978 |
ప్రెంచ్ ఓపెన్(3) |
మూస:Country data ARG గిలెర్మో విలాస్ |
6-1, 6-1, 6-3 |
| 1978 |
వింబుల్డన్ ఓపెన్ (3) |
జిమ్మీ కానర్స్ |
6-2, 6-2, 6-3 |
| 1979 |
ప్రెంచ్ ఓపెన్(4) |
మూస:Country data PAR విక్టర్ పెస్సీ |
6-3, 6-1, 6-7, 6-4 |
| 1979 |
వింబుల్డన్ ఓపెన్ (4) |
రోస్క్యూ టాన్నర్ |
6-7, 6-1, 3-6, 6-3, 6-4 |
| 1980 |
ప్రెంచ్ ఓపెన్(5) |
విటాస్ గెరులాటిస్ |
6-4, 6-1, 6-2 |
| 1980 |
వింబుల్డన్ ఓపెన్ (5) |
జాన్ మెకెన్రో |
1-6, 7-5, 6-3, 6-7(16), 8-6 |
| 1981 |
ప్రెంచ్ ఓపెన్(6) |
ఇవాన్ లెండిల్ |
6-1, 4-6, 6-2, 3-6, 6-1 |
[మార్చు] రెండో స్థానంలో నిలిచిన గ్రాండ్‌స్లామ్‌లు(5)
| సంవత్సరం |
చాంపియన్‌షిప్ |
పైనల్‌లో ప్రత్యర్థి |
పైనల్‌లో స్కోరు |
| 1976 |
అమెరికన్ ఓపెన్ |
జిమ్మీ కానర్స్ |
6-4, 3-6, 7-6, 6-4 |
| 1978 |
అమెరికన్ ఓపెన్ |
జిమ్మీ కానర్స్ |
6-4, 6-2, 6-2 |
| 1980 |
అమెరికన్ ఓపెన్ |
జాన్ మెకెన్రో |
7-6, 6-1, 6-7, 5-7, 6-4 |
| 1981 |
వింబుల్డన్ |
జాన్ మెకెన్రో |
4-6, 7-6, 7-6, 6-4 |
| 1981 |
అమెరికన్ ఓపెన్ |
జాన్ మెకెన్రో |
4-6, 6-2, 6-4, 6-3 |
[మార్చు] గ్రాండ్‌స్లాం సింగిల్స్ టోర్నమెంట్ల విశ్లేషణ
[మార్చు] జాన్ బోర్గ్ రికార్డులు
- ప్రెంచ్ ఓపెన్(పురుషుల విభాగం)లో అత్యధిక టైటిళ్ళను (6) గెల్చిన టెన్నిస్ ఆతగాడిగా రికార్డు సృష్టించాడు.
- వరుసగా 4 ప్రెంచ్ ఓపెన్ టైటిళ్ళను సాధించి (1978 నుంచి 1981 వరకు) రికార్డు సృష్టించాడు.
- బోర్గ్ 16 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల పైనల్‌లోకి ప్రవేశించి ఇవాన్ లెండిల్ (19), పీట్ సంప్రాస్ (18), రాడ్ లీవర్ (17) ల తర్వాత స్థానంలో నిల్చినాడు.
- 1972లో తన 15 వ ఏట డేవిస్ కప్ గెలిచి ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
- ↑ "Borg may still be at top of his game", The Otago Daily Times, July 14 2007
- ↑ "Navratilova joins Laver and Borg on the shortlist (as voted for by . . . Navratilova)", Alastair Campbell, The Times, July 3 2004
- ↑ "When he was king", Tim Pears, The Observer, June 5 2005
[మార్చు] బయటి లింకులు