తంజావూరు వీణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search



వీణ

వాద్య రకము

తంత్రీ వాయిద్యం

భాగములు

కుండ
దండి
యాళి
సొరకాయ బుర్ర

హస్త భూషణంగా కలిగిన దేవత

సరస్వతి


సుప్రసిద్ధ వైణికులు

అరికరేవుల సునందా శాస్త్రి
ఈమని శంకరశాస్త్రి
కాశీ కృష్ణాచార్యులు
తుమరాడ సంగమేశ్వరశాస్త్రి
పట్రాయని సంగీతరావు

తయారు చేయు ప్రాంతాలు

బొబ్బిలి
తంజావూరు
మైసూరు
త్రివేండ్రం

తంజావూరు వీణ తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉత్పత్తి అగుచున్నందున దీనికి తంజావూరు వీణగా ప్రసిద్ధి పొందింది.

వీణ సరస్వతి హస్త భూషణం కాబట్టి సరస్వతీ వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు. వీణలో ఏడు తంత్రులు ఉంటాయి. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులను వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు. వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చి ఉన్న 24 మెట్లు (రెండు స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమ చేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.[1]

చరిత్ర

[మార్చు]

సంగీత వాద్యాలలో వీణను సంగీత పరికరాల రాణిగా భావిస్తారు. వీణలలో తంజావూరు వీణకు విశేష ప్రాధాన్యత ఉంది. దీనిని రూపకల్పచేసి అభివృద్ధి చేసినవారు "గోవింద దీక్షితార్". ఆయన తంజావూరును పాలించిన రఘునాధనాయకుని కొలువులో ఉండేవారు. ఈ వీణను "సరస్వతీ వీణ" అని కూడా పిలుస్తారు. ఈ వీణ 4 అడుగుల పొడవు కలిగి పెద్ద అనునాదకం (కుడం), చెక్క వంతెన (కుడురాయి), బోలుగా ఉండే మెడ (దండి), ఏడు తీగలు ఉంటాయి.

ఈ వీణకు పనస చెట్లను వినియోగిస్తారు. వీణను తయరు చేయడానికి 100 సంవత్సరాల పైబడి పెరిగిన పనస చెట్లను వినియోగిస్తారు. ఈ చెట్టు కాండం ఇతర చెట్లవలె పెద్దగా పెరగదు. ఇది తేలికగా ఉండటమే కాకుండా మంచి ప్రతిధ్వనిని కూడా పలికిస్తుంది. మంచి దృఎడత్వం, మన్నిక, తేమని తట్టుకోగలగడం మొదలైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని విరివిగా వాడతారు. వీణను సాధారణంగా ఒకే కొయ్యతో తయారు చేస్తారు. తంజావూరు వీణను నాలుగు అడుగుల పొడవుతో తయారుచేస్తారు. తేలికైన చెక్కతో వీణను చెక్కుతారు. దీనిపై పెయింట్‌ వేసి రంగులద్దుతారు. రకారకాల పువ్వులు, జంతువుల నమూనాతోనూ వీణలను తయారుచేస్తారు.[2]

తయారీదారులు

[మార్చు]

సుమారు 100 కుటుంబాలు విశ్వకర్మ కులానికి చెందిన వారు తంజావూరులో నివసిస్తున్నారు. వారిది వీణలు తయారుచేయడమే వృత్తి. కానీ అందులో అనేక మంది ఈ వృత్తిని విడిచి పెట్టారు. సుమారు 10 కుటుంబాల వారు ఈ పరిశ్రమలో కృషిచేస్తున్నారు. ఈ వీణ పనస కర్రతో తయారుచేస్తారు. ఈ చెక్కను కడలూరు జిల్లా లోని పంతురి గ్రామం నుండి తెస్తారు. ఈ వీణలలో రెండు రకాలుంటాయి. వాటిలో - ఏకాంత వీణ (ఒకే చెక్కతో తయారు చేస్తారు), మూడు భాగాల వీణ (దీనిని మూడు పనస ముక్కలతో తయారుచేస్తారు). ఈ వీణ ఖరీదు సుమారు రూ.10,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది. ముడి చెక్కను ప్రతిభావంతులైన పనివారు తయారుచేస్తారు. ఒక వీణ తయారీకి సుమారు 20 నుండి 30 రోజులుపడుతుంది.[2][3]

కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్

[మార్చు]

"తంజావూరు మ్యూజికల్ ఇనస్ట్రమెంట్సు వర్కర్స్ ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్"ను 1952లో ప్రారంభించారు. ఈ సంస్థ సభ్యులచే తయారుచేయించిన వీణలను మార్కెట్ లో అమ్మకానికి పెడుతుంది.[4]

భౌగోళిక గుర్తింపు

[మార్చు]

తంజావూరు వీణ భౌగోళిక గుర్తింపు (జి.ఐ) కోసం దరఖాస్తు చేసుకుంది. ఓ సంగీత వాద్యానికి భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దీనికి మే 25 2014 న భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ విషయం భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రీలో డిసెంబరు 4 2012 న నమోదయింది. ప్రభుత్వం అధికారికంగా 2013 ప్రారంభంలో ప్రకటించింది. కొన్ని సంవత్సరముల తరువాత జి.ఐ నిర్ధారణ సర్టిఫికేటును తంజావూరు మ్యూజికల్‌ ఇన్ట్రూమెంట్స్‌ వర్కర్స్‌ కో-ఆపరేటీవ్‌ కాటేజీ ఇండస్ట్రీయల్‌ సొసైటీ లిమిటెడ్‌కు మే 25 2014 అందజేసారు.[5]

మూలాలు

[మార్చు]
  1. వీణ పలికిన ‘భూ’పాల రాగం February 1, 2013[permanent dead link]
  2. 2.0 2.1 "Thanjavur Veena". mythanjavur.com/. Archived from the original on 10 ఏప్రిల్ 2016. Retrieved 24 January 2016.
  3. "GI for Thanjavur Veena gives makers more leverage". timesofindia. May 26, 2014. Retrieved 24 January 2016.
  4. The veena makers of Thanjavur
  5. "Geographical Indication for Thanjavur Veena". aaryavartt.com/. Archived from the original on 15 జూలై 2014. Retrieved 27 May 2014.

ఇతర లింకులు

[మార్చు]