Jump to content

దేవదాసు (2006 సినిమా)

వికీపీడియా నుండి
దేవదాసు (2006 సినిమా)
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.ఎస్.చౌదరి
నిర్మాణం వై.వి.ఎస్.చౌదరి
రచన వై.వి.ఎస్.చౌదరి కథ, స్క్రీన్‌ప్లే
తారాగణం రామ్ పోతినేని,
ఇలియానా,
సాయాజీ షిండే
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం భరణి కె.ధరన్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు
విడుదల తేదీ జనవరి 11 2006
భాష తెలుగు
పెట్టుబడి 7 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

2006 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో అద్భుతమైన విజయం సాధించిన ఒక చిత్రం దేవదాసు. ప్రధాన పాత్రలలో క్రొత్త నటులున్నా ఘనవిజయం సాధించి ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇదే పేరుమీద ఇంతకుముందు తెలుగులో మరి రెండు చిత్రాలు వచ్చి ఉండడం విశేషం.

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

దేవదాసు (రామ్)ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. భానుమతి (ఇలియానా) ఒక ధనిక ప్రవాస భారతీయుని కుమార్తె. ఆమె తండ్రి కాటమరాకు (సాయాజీ షిండే) న్యూయార్క్ నగరంలో సెనేటర్. భానుమతి నృత్యం నేర్చుకోవడానికి భారతదేశం వచ్చినపుడు దేవదాసుతో ప్రేమలో పడింది. ఈ సంగతి తెలిసి పిల్ల తండ్రి వారికి పెళ్ళిచేస్తానని నమ్మించి, తరువాత కూతురును న్యూయార్క్ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు చాకులాంటి దేవదాసు అమెరికా వెళ్ళడమూ, తాను ప్రేమించిన చిన్నదానిని స్వంతం చేసుకోవడమూ ఈ సినిమా ఇతివృత్తం.

ఇందులో మిగిలిన నటులతో బాటు నిర్మాత-దర్శకుడు (వై.వి.ఎస్.చౌదరి), సంగీత దర్శకుడు (చక్రి) అతిథి పాత్రలలో కనిపించడం మరో విశేషం.

ఈ చిత్రంలో ఇలియానా కళ్ళకు గంతలు కట్టబడిన సన్నివేశము బహు పసందుగా వుండును.

తారాగణం

పాటల జాబితా

[మార్చు]

బంగారం , రచన: చంద్రబోస్, గానం.చక్రి, రేవతి

క్షమించు, రచన: చంద్రబోస్ ,గానం.కౌసల్య

నువ్వంటే ఇష్టం, రచన: చంద్రబోస్, గానం.చక్రి

అడిగి అడగలేక , రచన: చంద్రబోస్, గానం.కార్తీక్, సుజాత మోహన్

కుర్రాళ్లు , రచన: చంద్రబోస్, గానం.మాలతి లక్ష్మణ్

తెలుసా , రచన: చంద్రబోస్, గానం.చెర్రీ, రేవతి

ఓక నేస్తం , రచన: చంద్రబోస్, గానం.కార్తీక్,తినకమల్

ఆయే బాబా , రచన: చంద్రబోస్, గానం.అనుష్క మంచండ

గుండెల్ని పిండేది, రచన: చంద్రబోస్, గానం. చక్రి, విశ్వా

ఇదిగిదిగో , రచన: చంద్రబోస్, గానం.సింహా, వేణు

మాయదారి చిన్నోడు , రచన: విశ్వా, గానం.విజయలక్ష్మీ.

ఇతర సాంకేతిక వర్గం

[మార్చు]

అవీ ఇవీ

[మార్చు]
  • ఇందులో రామ్, ఇలియానా - ఇద్దరికీ ఇది మొదటి చిత్రమే.
  • ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులు ఆడింది.[1]

బయటి లింకులు

[మార్చు]